సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ritu Varma: వరుస చిత్రాలతో బిజీ బిజీ

ABN, First Publish Date - 2022-05-19T18:53:52+05:30

తెలుగమ్మాయి రీతూ వర్మ (Ritu Varma) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ ఎలాంటి పాత్రలనైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగమ్మాయి రీతూ వర్మ (Ritu Varma) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ యంగ్ బ్యూటీ ఎలాంటి పాత్రలనైనా అలవోకగా పోషిస్తూ అటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. రీతూ వర్మ తెలుగులో ‘పెళ్ళి చూపులు’ (Pelli Chupulu) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) దర్శకత్వం వహించాడు. పెళ్లి చూపులు నేపథ్యంలో క్లీన్ మూవీగా వచ్చి డీసెంట్ హిట్ సాధించింది. 


ఈ మూవీలో రీతూ వర్మ పర్ఫార్మెన్స్ చూసిన అందరూ తెలుగులో ఖాళీ లేకుండా హీరోయిన్ అవకాశాలు అందుకుంటుందని భావించారు. కానీ, ఎందుకనో అలా జరగలేదు. తెలుగు కంటే కూడా తమిళంలో తనకు మంచి అవకాశాలు వచ్చాయి. దాంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో నటించి క్రేజ్ సంపాదించుకుంది రీతూ. అదే క్రేజ్‌తో తెలుగులోనూ వరుసగా నాని (Nani) సరసన ‘టక్ జగదీష్’ (Tak Jagadish), నాగ శౌర్య (Naga Shaurya) సరసన ‘వరుడు కావలేను’ (Varudu Kaavalenu) సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ఇపుడు వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. తమిళంలో వచ్చిన ‘కన్నుం కన్నుం కొల్లైయడిత్తాల్‌’లో రీతూ నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. 


ప్రస్తుతం విశాల్‌ -ఎస్‌జే.సూర్య కాంబోలో తెరకెక్కుతున్న ‘మార్క్‌ ఆంటోనీ’ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మ అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే, ఆమె నటించిన ‘కణం’ టీజర్‌ ఇప్పటికే రిలీజ్‌ కాగా, ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక, అశోక్‌ సెల్వన్‌ సరసన ‘నిత్తం ఒరు వానం (తెలుగులో ఆకాశం)లో నటించగా, ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఇలా రీతూ వర్మ సౌత్ భాషలలో హీరోయిన్‌గా  నటిస్తూ బిజీగా తన సినీ కెరీర్‌ కొనసాగిస్తోంది. 

Updated Date - 2022-05-19T18:53:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!