ఆస్కార్ అవార్డ్స్ వివాదం.. కమెడియన్ క్రిస్‌కి మరో కమెడియన్ సపోర్టు..

ABN , First Publish Date - 2022-04-08T18:14:18+05:30 IST

దాదాపు రెండేళ్ల తర్వాత ఆస్కార్ అవార్డులు ఇటీవలే న్యూయార్క్‌లో జరిగాయి. అయితే ఆ కార్యక్రమంలో ఓ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది...

ఆస్కార్ అవార్డ్స్ వివాదం.. కమెడియన్ క్రిస్‌కి మరో కమెడియన్ సపోర్టు..

దాదాపు రెండేళ్ల తర్వాత ఆస్కార్ అవార్డులు ఇటీవలే న్యూయార్క్‌లో జరిగాయి. అయితే ఆ కార్యక్రమంలో ఓ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. అదే ఈ షోని హోస్ట్ చేసిన కమెడియన్ క్రిస్ రాక్‌‌ని స్టార్ హీరో విల్ స్మిత్ కొట్టడం. విల్ స్మిత్ భార్యకి అలోపేసియా అనే వ్యాధి కారణంగా జుట్టు ఊడిపోయి గుండు అయ్యింది. దీంతో ఆమెని ఓ హాలీవుడ్ సినిమాలోని క్యారెక్టర్‌తో పోలుస్తూ కమెడియన్ జోక్ చేశాడు. ఇది విల్‌కి నచ్చకపోవడంతో క్రిస్‌ని చెంపమీద గట్టిగా కొట్టాడు. 


అయితే.. ఈ ఘటనపై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించారు. వారిలో కొందరు క్రిస్.. మరికొందరు విల్‌కి సపోర్టు చేశారు. తాజాగా మరో నటుడు, కమెడియన్ రికీ గెర్వైస్ స్పందించాడు. రికీ మాట్లాడుతూ.. ‘అవార్డుల షోలలో రెచ్చగొట్టడం కొత్తేమీ కాదు. అలాగే విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్‌పై జోక్ చేశాడు. అంత మాత్రానికే అందరిముందు కొట్టడం కరెక్టు కాదు. అలా ఎవరూ చేయరు. అయితే జడాకి ఉన్న వ్యాధి గురించి అతనికి తెలియకపోవచ్చు. అందుకే అలా జోక్ చేశాడని మాత్రం చెప్పగలను. అతనికి ఆమె వ్యాధి గురించి తెలిస్తే ఖచ్చితంగా జోక్ చేసేవాడు కాదని అనుకుంటున్నా’ అని క్రిస్‌కి సపోర్టుగా రాసుకొచ్చాడు.


అయితే.. ఈ అవార్డు షోలోనే విల్ స్మిత్ ‘కింగ్ రిచర్డ్’ సినిమాకి గానూ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ సందర్భంలోనే కొట్టినందుకు క్రిస్‌కి క్షమాపణలు సైతం చెప్పాడు. దీంతో ఆ వివాదం కొంచెం చల్లారినప్పటికీ పూర్తిగా సమసిపోలేదు.

Updated Date - 2022-04-08T18:14:18+05:30 IST

Read more