సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

39 ఏళ్ళ తర్వాత మాతృభాషలో అవార్డు అందుకున్న Revathi

ABN, First Publish Date - 2022-06-01T22:27:06+05:30

దక్షిణాది సీనియర్‌ నటి రేవతి (Revathi)కి అనేక అవార్డులు, పురస్కారాలు వరించాయి. వీటిలో మూడు జాతీయ అవార్డులున్నాయి. అలాగే, తమిళ, తెలుగు చిత్రపరిశ్రమల నుంచి కూడా రేవతి పురస్కారాలు అందుకున్న సందర్భాలున్నాయి. కానీ, మాతృభాష మలయాళంలో మాత్రం ఒక్క అవార్డు రాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది సీనియర్‌ నటి రేవతి (Revathi)కి అనేక అవార్డులు, పురస్కారాలు వరించాయి. వీటిలో మూడు జాతీయ అవార్డులున్నాయి. అలాగే, తమిళ, తెలుగు చిత్రపరిశ్రమల నుంచి కూడా రేవతి పురస్కారాలు అందుకున్న సందర్భాలున్నాయి. కానీ, మాతృభాష మలయాళంలో మాత్రం ఒక్క అవార్డు రాలేదు. 1983లో ‘కాట్టత్తే కిళికూడు’ (Kattathe Kilikoodu) (గాల్లో పక్షిగూడు) మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రేవతి... అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించినా అవార్డు మాత్రం రాలేదు. బహుశా మలయాళంలో కన్నా ఆమె తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేయడం దీనికి కారణమని అనుకోవాలి. 


ఎట్టకేలకు తాజాగా, ప్రకటించిన 52వ కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్డుల్లో ‘భూతకాలం’ (Bhoothakalam) అనే చిత్రంలో ఉత్తమ నటనకుగాను రేవతిని ఉత్తమ నటి అవార్డు వరించింది. షేన్ నిగమ్ (Shen Nigam) హీరోగా నటించిన ఈ సినిమా హారర్ జోనర్ లో తెరకెక్కింది. రాహుల్ సదాశివన్ (Rahul Sadashivan) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో సోనీ లివ్ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ లో విడుదలైంది.  తనకొచ్చిన అవార్డుపై  రేవతి స్పందిస్తూ.. ‘ఏదో ఒక రకంగా సెలక్షన్‌ కమిటీ సభ్యులకు నా నటన నచ్చింది. అందుకే ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. ఈ తరుణంలో దర్శకుడుతో పాటు చిత్రం యూనిట్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-01T22:27:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!