ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా నా సినిమా చూస్తారంటోన్న ‘Rocky Bhai’!

ABN , First Publish Date - 2022-03-29T02:00:57+05:30 IST

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వచ్చేస్తోంది. పార్ట్ వన్ సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ సీక్వెల్ మూవీ గురించి చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఒక్క చిక్కు మాత్రం యశ్ స్టారర్ బిగ్ బడ్జెట్ మూవీకి తప్పేలా లేదు...

ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా నా సినిమా చూస్తారంటోన్న ‘Rocky Bhai’!

‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వచ్చేస్తోంది. పార్ట్ వన్ సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ సీక్వెల్ మూవీ గురించి చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా దెబ్బతో వాయిదా పడుతూ వచ్చిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఎట్టకేలకు ఏప్రెల్ 14న రిలీజ్ అవ్వనుంది. ఆల్రెడీ ట్రైలర్ సెన్సేషన్ సృష్టిస్తోంది కూడా. ‘కేజీఎఫ్’లో లేని సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి వారు కూడా సెకండ్ ఇన్‌స్టాల్మెంట్‌లో జత కలవటం మరింత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతోంది. కానీ, ఒక్క చిక్కు మాత్రం యశ్ స్టారర్ బిగ్ బడ్జెట్ మూవీకి తప్పేలా లేదు... 


2022 ఏప్రెల్ 14న తమ సినిమా రిలీజ్ అవుతుందని ‘కేజీఎఫ్’ ఫిల్మ్ మేకర్స్ 8 నెలల కిందటే అనౌన్స్ చేశారు. అయితే తరువాత ఏప్రెల్ 13న తాను బరిలోకి దిగుతున్నట్టు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రకటించాడు. పూజా హెగ్డేతో కలసి ఆయన నటించిన ‘బీస్ట్’ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కంటే కేవలం ఒక్క రోజు ముందుగా విడుదలవుతోంది. మరి ఆ ఎఫెక్ట్ యశ్ మూవీపై ఉంటుంది కదా? అదే ప్రశ్న అడిగారు మీడియా ప్రతినిధులు. దానికి ఆసక్తికర, అద్భుత జవాబునిచ్చాడు ‘రాకీ భాయ్’... 


విజయ్ మూవీతో తన చిత్రం బాక్సాఫీస్ క్లాష్ గురించి మాట్లాడిన యశ్... ‘కేజీఎఫ్ vs బీస్ట్’ కాదంటూ ’కేజీఎఫ్ అండ్ బీస్ట్’ అని వ్యాఖ్యానించాడు. రెండూ సినిమాలూ జనానికి నచ్చితే రెండూ సూపర్ హిట్ అవుతాయని అన్నాడు. అంతే కాదు, ‘‘విజయ్ సర్ చాలా పెద్ద స్టార్. ఆయనని మనం గౌరవించాలి...’’ అని కూడా కామెంట్ చేశాడు! అక్కడితో ఆగక యశ్ మరింతగా పొగడ్తలతో ముంచెత్తాడు. హీరో విజయ్ ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అంటూ మెచ్చుకున్నాడు. అలాంటి సీనియర్ కంటే తాను గొప్పవాడ్ని అని ఫీలైతే... ఆ క్షణం నుంచే తన పతనం మొదలవుతుందని చెప్పుకొచ్చాడు! ఆపై యశ్ తాను ‘బీస్ట్’ మూవీ చూస్తానని చెప్పాడు. విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా తమ సినిమాని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు! మొత్తానికి కోలీవుడ్ స్టార్ హీరోని ఆకాశానికి ఎత్తేస్తూనే... తన సినిమా చూడమంటూ పరోక్షంగా తమిళ ప్రేక్షకులకి పిలుపునిచ్చాడు. చూడాలి మరి, ‘బీస్ట్’తో పోటిపడుతూ తమిళ మార్కెట్లో ‘కేజీఎఫ్ 2’ ఎలాంటి వసూళ్లు రాబడుతుందో...      

Updated Date - 2022-03-29T02:00:57+05:30 IST