777 Charlie గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. Netflix, Amazon Prime, Hotstar లలో దేనిలో ఈ సినిమా రాబోతోందంటే..

ABN , First Publish Date - 2022-06-15T23:29:31+05:30 IST

‘కిరిక్ పార్టీ’, ‘అతడే శ్రీమన్నారాయణ’ (Athade Srimannarayana)వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). అతడు హీరోగా నటించిన

777 Charlie గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. Netflix, Amazon Prime, Hotstar లలో దేనిలో ఈ సినిమా రాబోతోందంటే..

‘కిరిక్ పార్టీ’, ‘అతడే శ్రీమన్నారాయణ’ (Athade Srimannarayana)వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty). అతడు హీరోగా నటించిన తాజా చిత్రం ‘777 చార్లి’ (777 Charlie). పాన్ ఇండియాగా తెరకెక్కించారు. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రూపొందించారు. కె. కిర‌ణ్ రాజ్‌ (K. Kiran Raj) ద‌ర్శకత్వం వహించాడు.  ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 10న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. భారీ వసూళ్లను రాబడుతుంది. ధర్మ(రక్షిత్ శెట్టి), చార్లి అనే కుక్కకు మధ్య గల అనుబంధాన్ని ఈ చిత్రంలో హృద్యంగా ఆవిష్కరించారు.  


‘777 చార్లి’ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫాం ఫిక్సయింది. స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ గెలుచుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం ఆ ప్లాట్‌ఫాం ప్రకటించలేదు. కానీ, ఆగస్టు రెండో వారం నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో సంగీత శ్రింగేరి, రాజ్ బి. శెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు  కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 30కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘777 చార్లి’ సినిమాతోనే కిరణ్ రాజ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం తన కలల ప్రాజెక్టు అని చెప్పాడు. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను అతడు అభిమానులతో గతంలో పంచుకున్నాడు. ‘‘సినిమా కోసం లాబ్రాడర్ కుక్కలను ఎంపిక చేశాం. ఆ కుక్కలు భావాలను అద్భుతంగా పలికించగలవు. చిత్రంలోని పప్పీకీ రెండు నుంచి రెండున్నరేళ్లు శిక్షణ ఇచ్చాం. కుక్క రక్షిత్‌ను కౌగిలించుకునే సీన్ కోసమే ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చాం. సినిమా స్క్రిఫ్ట్‌ను యేడాదిన్నర పాటు రాశాను. కుక్కల మీద పరిశోధన కూడా చేశాను’’ అని కిరణ్ రాజ్ తెలిపాడు.

Updated Date - 2022-06-15T23:29:31+05:30 IST