777 Charlie OTT Release Date: రక్షిత్ శెట్టి సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలోకి రాబోతోందంటే..
ABN, First Publish Date - 2022-07-27T18:37:34+05:30
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కన్నడ మూవీ ‘777 చార్లీ’. ‘శ్రీమన్నారాయణ’ అనే..
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్న కన్నడ మూవీ ‘777 చార్లీ (777 Charlie)’. ‘శ్రీమన్నారాయణ’ అనే డిఫరెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించాడు. ఈ సినిమా జూన్ 10న కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. కిరణ్‌రాజ్ కే దర్శకత్వం వహించిన ఢిఫరెండ్ ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. అప్పటి నుంచి థియేటర్స్‌లో ఈ మూవీని మిస్సయిన ఎంతోమంది ఓటీటీలో చూడడానికి ఎదురుచూస్తున్నారు.
‘777 చార్లీ’ దేశవ్యాప్తంగా జంతు ప్రేమికుల గుండెలను కట్టిపడేసింది. కుక్కకి, మనిషికి మధ్య బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వూట్‌కి సంపాదించుకుంది. జూలై 29, 2022న తెలుగు, మలయాళం, తమిళం, కన్నడతో అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు కిరణ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘చాలా కష్టపడి ఈ సినిమాని చేశాం. అలాంటి మూవీ హిట్ అవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులకు నచ్చే చిత్రాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నించాను. ఈ మూవీని పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు మొదటిసారి రక్షిత్ శెట్టి ఈ సినిమా చూశాడు. ఆయన నాతో.. కిరణ్ ఈ సినిమా కచ్చితంగా అందరికీ మంచి పేరుని తెచ్చిపెడుతుందనిపిస్తోంది. ఇది కేవలం సినిమాగానే కాకుండా సరికొత్త అనుభూతిని మిగుల్చుతుందన్నాడు. నాకు అదే నమ్మకం ఉంది. అందుకే ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చిన సరే పట్టించుకోకుండా థియేటర్లలోనే విడుదల చేశాం. ఇప్పుడు ఓటీటీలో విడుదలై అక్కడ కూడా అందరికీ మంచి అనుభూతిని పంచాలి’ అని చెప్పుకొచ్చాడు.