Rajinikanth: ‘బాబా’ కోసం సూపర్‌స్టార్ డబ్బింగ్.. ఈ సారైనా మ్యాజిక్ చేసేనా?
ABN, First Publish Date - 2022-11-29T14:20:53+05:30
ఇటీవల ఎక్కువగా పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల..
ఇటీవల ఎక్కువగా పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా చాలా సినిమాలు థియేటర్స్‌లో విడుదలై మంచి కలెక్షన్లని కొట్టగొట్టాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), మనీషా కోయిరాల (Manisha Koirala) జంటగా నటించి 2002లో వచ్చిన ‘బాబా’ (Baba) చిత్రం త్వరలోనే 4కె ప్రింట్ (4K Print)తో త్వరలో రీ-రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. రీ-రిలీజ్ వెర్షన్లో కొన్ని కొత్త సీన్స్ కూడా జత చేస్తున్నారు. తాజాగా ఆ సీన్స్‌కు సంబంధించిన డబ్బింగ్ సూపర్‌స్టార్ (Superstar) పూర్తి చేశారు.
ఓ డబ్బింగ్ స్టూడియోలో ఆయన డబ్బింగ్ చెబుతుండగా తీసిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లోటస్ ఇంటర్నేషనల్ బ్యానరుపై రజనీకాంత్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. కాన్సెప్ట్ కొత్తదే అయినప్పటికీ కథనం బోరింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇపుడు 4కె ప్రింట్‌తో వస్తున్న ‘బాబా’ కనీసం ఇపుడైనా ఆశించిన స్థాయిలో ఆడుతుందో లేదో వేచి చూడాలి.