సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కేఎస్‌ దర్శకత్వంలో Raghava Lawrence కొత్త చిత్రం

ABN, First Publish Date - 2022-06-27T19:12:47+05:30

దక్షిణాదిన డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. బిగినింగ్ లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అతడికి సరైన గుర్తింపు రాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాదిన డ్యాన్స్ కొరియో గ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. బిగినింగ్ లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అతడికి సరైన గుర్తింపు రాలేదు. అయితే ‘ముని’ (Muni) హారర్ సిరీస్ తో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిత్రాలు తెరకెక్కగా అన్ని సూపర్ సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం లారెన్స్ హీరోగా పలు చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడు హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది.  


ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కేఎస్ రవికుమార్‌ (KS Ravikumar) చాలా గ్యాప్‌ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇందులో రాఘవ లారెన్స్‌ హీరోగాను, ఆయన తమ్ముడు ఎల్విన్‌ (Elvin) ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు తాజాగా నగరంలో జరిగాయి. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా, రాఘవ లారెన్స్‌ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2), ‘అధికారం’ (Adhikaram), ‘రుద్రన్‌’ (Rudran) లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘రుద్రన్‌’ క్రిస్మ్‌స్‌కు విడుదల చేసేలా ప్లాన్‌ చేశారు. మరి ఈ సినమా రాఘవ లారెన్స్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-06-27T19:12:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!