PS - 1: రికార్డ్ ధరకు ఆడియో రైట్స్..?

ABN , First Publish Date - 2022-07-08T14:07:45+05:30 IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). తాజ సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయట.

PS - 1: రికార్డ్ ధరకు ఆడియో రైట్స్..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). తాజ సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయట. కార్తి (Karthi), త్రిష (Trisha), విక్రమ్ (Vikram),  ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), జయం రవి (Jayam Ravi), జయరాం (Jayaram), ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రభు (Prabhu), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 


ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో, భాగంగా ప్రధాన తారాగణంకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈపోస్టర్స్‌కి అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. 


అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని భాషల ఆడియో హక్కులను రికార్డ్ ధరకు ప్రముఖ ఆడియో సంస్థ టిప్స్ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారట. కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం ఈ చిత్రానికి 24 కోట్లు భారీ మొత్తంలో టిప్స్ మ్యూజిక్ వారు చెల్లించారట. ఇది సౌత్ ఇండియన్ సినిమా దగ్గర రికార్డు మొత్తంలో ఒకటని అంటున్నారు. ఇక ఇదే ఆడియో సంస్థకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' ఆడియో హక్కులు కూడా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-07-08T14:07:45+05:30 IST