జర్నలిస్ట్ అడిగిన అనూహ్య ప్రశ్నకి... Priyanka Chopra ఘాటైన సమాధానం...

ABN , First Publish Date - 2022-01-14T22:54:33+05:30 IST

ప్రియాంక చోప్రాకు కోపం వచ్చింది. ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ప్రశ్నకి మన దేసీ బ్యూటీ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఇంతకీ అతడు అడిగిన ఆకతాయి ప్రశ్న ఏంటంటారా?

జర్నలిస్ట్ అడిగిన అనూహ్య ప్రశ్నకి... Priyanka Chopra ఘాటైన సమాధానం...

ప్రియాంక చోప్రాకు కోపం వచ్చింది. ఓ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ప్రశ్నకి మన దేసీ బ్యూటీ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఇంతకీ అతడు అడిగిన ఆకతాయి ప్రశ్న ఏంటంటారా? ప్రియాంక, నిక్ జోనాస్ ‘సినిమా’కి చేసిన సేవ ఏంటి అని పీటర్ ఫోర్డ్ అడిగాడు! వాళ్లిద్దరి ‘కాంట్రిబ్యూషన్ టూ మూవీస్’ ఏంటని అనటం ద్వారా నిక్, పీసీ పెద్దగా సాధించిందేమీ లేదని అతను దెప్పిపొడిచాడు. మరి అటువంటి పొగరుబోతు జర్నలిస్ట్‌కి మన ప్రియాంక జవాబు ఇవ్వకుండా ఊరుకుంటుందా చెప్పండి? ఇచ్చేసింది... 


‘‘సాధారణంగా నేను అంత తేలిగ్గా అసహనానికి లోనుకాను. కానీ, ఆ ప్రశ్న నాకు కోపం తెప్పించింది...’’ అంటోంది ప్రియాంక చోప్రా. ‘‘ఇదుగో ఇవి నా ‘60 ప్లస్ ఫిల్మ్ క్రిడెన్షియల్స్’. జాగ్రత్తగా చూసుకోండి...’’ అని ఆమె సొషల్ మీడియాలో తన గత చిత్రాల లిస్ట్ కూడా ప్రకటించింది! 


కొద్ది రోజుల క్రితం ‘మ్యాట్రిక్స్ 4’ మూవీలో కనిపించిన ప్రియాంక ఆస్కార్స్ వేడుకలో భర్త నిక్‌తో కలసి నామినీస్‌ని అనౌన్స్ చేసింది. అలాగే, వెబ్ సిరీస్‌లో కూడా కనిపించబోతోంది. బాలీవుడ్‌లో భారీ గ్యాప్ తరువాత... ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో ‘జీ లే జరా’ మల్టీ స్టారర్‌లో ఆలియా, కత్రీనాతో కలసి నటించనుంది... 

Updated Date - 2022-01-14T22:54:33+05:30 IST