కలర్‌ఫుల్ కపుల్ : రంగుల్లో తడిసి ముద్దైన Priyanka, Nick
ABN , First Publish Date - 2022-03-20T00:00:04+05:30 IST
అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో ఉన్న తమ ఇంట్లో జరుపుకున్న హోలీ సంబరాల్ని ప్రియాంక, నిక్ జోనాస్ నెటిజన్స్‌తో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు తమ రంగురంగుల ఫోటోల్ని, వీడియోల్ని షేర్ చేశారు. దేసీ బ్యూటీ ప్రియాంక కలర్ఫుల్గా సందడి చేసిన జోనాస్ ఫ్యామిలీ హోలీ బాష్‌లో...
అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో ఉన్న తమ ఇంట్లో జరుపుకున్న హోలీ సంబరాల్ని ప్రియాంక, నిక్ జోనాస్ నెటిజన్స్‌తో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారు తమ రంగురంగుల ఫోటోల్ని, వీడియోల్ని షేర్ చేశారు. దేసీ బ్యూటీ ప్రియాంక కలర్ఫుల్గా సందడి చేసిన జోనాస్ ఫ్యామిలీ హోలీ బాష్‌లో... నిక్ సోదరులు కెవిన్, ఫ్రాంక్లిన్ కూడా పాల్గొన్నారు. ఆడ, మగా అంతా కలసి రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ప్రియాంక అయితే భర్త నిక్‌ను ముద్దాడుతూ రొమాంటిక్ హోలీని తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన తమ ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ అండ్ వీడియోస్‌తో పాటూ, ఆమె... ‘‘దేసీ ఇండియన్స్ మాదిరిగా హోలీ ఆడిన మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఫీలింగ్ బ్లెస్డ్’’ అంటూ క్యాప్షన్ రాసింది.