ఆస్పత్రిలో చేరిన పాపులర్ మలయాళం నటుడు

ABN , First Publish Date - 2022-04-08T00:34:44+05:30 IST

పాపులర్ మలయాళం నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ శ్రీనివాసన్ ఆసుపత్రిలో

ఆస్పత్రిలో చేరిన పాపులర్ మలయాళం నటుడు

పాపులర్ మలయాళం నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్ శ్రీనివాసన్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో మార్చి 30న కేరళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. యాంజియో గ్రామ్ పరీక్ష చేయగా గుండెకు సమస్య ఉందని తేలింది. దీంతో మార్చి 31న బై పాస్ సర్జరీ చేయించుకున్నారు. అనంతరం చికిత్స అందించడంతో కోలుకోవడం మొదలుపెట్టారు. తాజాగా పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నారు. 


శ్రీనివాసన్‌కు ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద కుమారుడు వినీత్ శ్రీనివాసన్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న కొడుకు ధ్యాన్ శ్రీనివాసన్ కూడా సినీ ఇండస్ట్రీలోనే కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. శ్రీనివాస‌న్ మాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అనేక సినిమాల్లో నటించారు. పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించినందుకు 1989, 1991,1995, 1998, 2006, 2007లో కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్‌ను గెలుచుకున్నారు.

Updated Date - 2022-04-08T00:34:44+05:30 IST

Read more