సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

12 ఏళ్ల బంధానికి బ్రేక్.. భర్తతో విడిపోయిన పాప్ స్టార్ Shakira

ABN, First Publish Date - 2022-06-05T18:57:37+05:30

కొలంబియన్ పాప్ స్టార్ షకీరా, ఫుట్‌బాల్ క్రీడాకారుడు గెరార్డ్ పిక్ (Gerard Pique) తమ 12 ఏళ్ల వివాహబంధానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబియన్ పాప్ స్టార్ షకీరా, ఫుట్‌బాల్ క్రీడాకారుడు గెరార్డ్ పిక్ (Gerard Pique) తమ 12 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలికారు. ‘హిప్స్ డోంట్ లై’ వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ 45 ఏళ్ల గాయని.. పుష్కరకాలం క్రితం పుట్‌బాల్‌లో వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్‌లో విజయం సాధించిన 35 ఏళ్ల ఆడగాడిని ప్రేమించి పెళ్లాడింది. వీరిద్దరికి ఇద్దరూ కుమారులు ఉన్నారు. అయితే.. నివేదికల ప్రకారం గెరార్డ్ పిక్ మరొక మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉండడమే ఈ విడాకులకి కారణమని తెలుస్తోంది.


ఈ విడాకుల (Divorce) విషయాన్ని తెలియజేస్తూ ఈ జంట ఓ ప్రకటనని విడుదల చేసింది. అందులో.. ‘మేము విడిపోతున్నామని చెప్పడానికి చింతిస్తున్నాం. మాకు ఎంతో ముఖ్యమైన మా పిల్లల శ్రేయస్సు కోసం, మా గోప్యతను అందరూ గౌరవించాలని కోరుతున్నాం’ అని చెప్పుకొచ్చారు. అయితే.. వీరి డైవోర్స్ విషయం తెలిసిన వారి అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఇలాంటి ఫర్ఫెక్ట్ కపుల్ విడిపోవడం బాధగా ఉందని నెట్టింట చర్చించుకుంటున్నారు.

Updated Date - 2022-06-05T18:57:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!