Ponniyin Selvan 1: మిక్స్‌డ్ టాక్.. అయినా 3 రోజుల్లో.. 230 కోట్లా?

ABN , First Publish Date - 2022-10-03T18:08:45+05:30 IST

లెంజెండరీ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). దాదాపు నాలుగు దశాబ్దాల కలని తాజాగా నేరవేర్చుకున్నాడు ఈ దర్శకుడు. రెండు భాగాలుగా రానున్న..

Ponniyin Selvan 1: మిక్స్‌డ్ టాక్.. అయినా 3 రోజుల్లో.. 230 కోట్లా?

లెంజెండరీ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). దాదాపు నాలుగు దశాబ్దాల కలని తాజాగా నేరవేర్చుకున్నాడు ఈ దర్శకుడు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్‌ను ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి ప్రపంచవ్యాప్తంగా (worldwide) భారీ వసూళ్లను కొల్లగొడుతుంది. అంతేకాకుండా.. ప్రపంచవ్యాప్తంగా 2022లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


కాగా.. ఈ మూవీ తాజాగా మరో ఫీట్‌ని సాధించింది. ‘పీఎస్ 1’ కేవలం మూడు రోజుల్లోనే రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘మూడు రోజుల మొదటి వారాంతంలో.. పీఎస్ 1 ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 230 కోట్లు సాధించింది’ అని రాసుకొచ్చాడు. కాగా.. ఈ మూవీ విడుదలైన మొదటి రోజే.. తమిళనాడులో రూ.25.86కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.5.93కోట్లు, కర్ణాటకలో రూ.5కోట్లు, కేరళలో రూ.3.7కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3.5కోట్లు, ఓవర్సీస్‌లో రూ.35కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి ఓవర్సీస్‌లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. అందుకే కేవలం మూడు రోజుల్లోనే 3.3 మిలియన్ డాలర్ల వసూళ్లని రాబట్టగలిగింది. దీంతో.. మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ చిత్రం ఇలా అద్భుతమైన కలెక్లన్లతో దూసుకెళుతుందేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా.. ఈ కలెక్షన్ల లెక్కలు నిజమేనా లేక నిర్మాతలు కావాలనే ఇలాంటి లెక్కలను చెబుతున్నారా అని చర్చించుకుంటున్నారు. కాగా.. ఈ మూవీలో ఐశ్వర్య రాయ్, త్రిష, చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాళ తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Updated Date - 2022-10-03T18:08:45+05:30 IST