Bigg Boss Non Stop: మిత్రా శర్మ.. ఆ ఫొటో వెనుక కథ ఇదే!

ABN , First Publish Date - 2022-05-03T23:36:03+05:30 IST

ఓటీటీలో ప్రసారం అవుతోన్న బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌(Bigg Boss Non Stop)లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా మిత్రా శర్మ (Mitraaw Sharma)

Bigg Boss Non Stop: మిత్రా శర్మ.. ఆ ఫొటో వెనుక కథ ఇదే!

ఓటీటీలో ప్రసారం అవుతోన్న బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌(Bigg Boss Non Stop)లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా మిత్రా శర్మ (Mitraaw Sharma) దూసుకుపోతుంది. టాలీవుడ్‌లో హీరోయిన్‪గానూ మెప్పిస్తున్న ఈ భామ.. వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ.. నిర్మాతగానూ కొన్ని చిత్రాలను నిర్మిస్తోంది. హీరోయిన్‪గా, నిర్మాతగా బిజీగా ఉన్న మిత్రా శర్మ బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ షోలోకి ఎంటరైనప్పటి నుండి ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గత నామినేషన్ల ప్రక్రియ నుంచి హోస్ట్ నాగార్జున (Nagarjuna) నిర్వహించే వీకెండ్ షో వరకు ఆమె ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది. అయితే గత వారం నాగార్జున వేదికపై చూపించిన ఫోటో చూసి మిత్రా శర్మ ఎమోషనల్ అయింది. అసలా ఫోటో వెనుక కథ ఏమిటంటే..


గతవారం నామినేషన్ల ప్రక్రియ సమయంలో తనను టార్గెట్ చేస్తూ బిందు మాధవి (Bindu Madhavi) చేసిన వ్యాఖ్యలను మిత్రా శర్మ తప్పుపట్టింది. బిందుమాధవికి మిత్రా కూడా బలంగానే బదులిచ్చింది. మిత్రా శర్మను ఉద్దేశించి  బిందు మాధవి చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏదైనా విషయం ఉంటే.. దానిని తప్పుగా ఊహించుకోవద్దని ఇంటి సభ్యులకు అని నాగార్జున సలహా ఇచ్చారు. అనంతరం వేదికపైకి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను పిలిచి ఫన్ గేమ్ ఆడించారు. కానీ మిత్రా శర్మ విషయంలో ఇంటి సభ్యులు కాకుండా ఓ ఫొటోని చూపించారు. ఆ ఫొటో చూసి ఆమె ఎమోషనల్ అయింది. ఆ ఫొటో ఎవరిదీ అంటే తన తండ్రిది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న మిత్రాశర్మ.. తన కష్టసుఖాలను ఆ ఫొటోకే చెప్పుకుంటుందట. అందుకే ఆ ఫొటో చూసి ఆమె తట్టుకోలేకపోయింది. ఇంటిలోకి అందరి కుటుంబ సభ్యులు వస్తున్నారు. నాకు మాత్రం ఎవరూ లేరంటూ ఆమె బోరుబోరున విలపించింది. అయితే ఇలాంటి భావోద్వేగమైన క్షణాల్లో మిత్రాశర్మకు ఇష్టమైన సిరి హన్మంత్ (Siri Hanmanth), గంగాధర్‌(Gangadhar)ను కింగ్ నాగార్జున పరిచయం చేశారు. వారిని చూడగానే మిత్రాశర్మ మరోసారి ఎమోషనల్ అయ్యింది.   


ఇక తనను చూడటానికి వచ్చిన గంగాధర్‌ గురించి  మిత్రాశర్మ మాట్లాడుతూ.. తన తండ్రి తర్వాత తండ్రిలాంటి వారని.. నాకు అన్నయ్యలాంటి వారని ఆనందం వ్యక్తం చేసింది. తన కోసం సిరి, గంగాధర్‪లు వచ్చినందుకు ఆమె ఖుషీ అయ్యింది. మిత్రాశర్మ గురించి గంగాధర్ మాట్లాడుతూ.. ఆమె సివంగి. అలానే ఇంటిలో ఆడుతున్నది. బయట ఎలా ఉంటుందో.. ఇంటిలో కూడా అలానే ఉంది. షోలో బాగా ఆడుతున్నది అని చెప్పగా.. టాప్ 5లో మిత్రా ఉండటం ఖాయం అని సిరి హన్మంతు జోస్యం చెప్పింది. దీంతో ఈ వారం మిత్రా శర్మ బాగా హైలెట్ అయ్యింది. 

Updated Date - 2022-05-03T23:36:03+05:30 IST