Director: పెద్ద సంస్థలు విడుదల చేస్తేనే.. చిన్న సినిమాలు హిట్‌ అవుతాయి!

ABN , First Publish Date - 2022-12-05T15:50:46+05:30 IST

‘నేటి సినిమా ప్రపంచంలో చిన్న చిత్రాలను బడా సంస్థలు కొనుగోలు చేసి విడుదల చేస్తేనే ఘన విజయం సాధిస్తున్నాయి’ అని సీనియర్‌ దర్శకుడు పేరరసు అన్నారు..

Director: పెద్ద సంస్థలు విడుదల చేస్తేనే.. చిన్న సినిమాలు హిట్‌ అవుతాయి!

‘నేటి సినిమా ప్రపంచంలో చిన్న చిత్రాలను బడా సంస్థలు కొనుగోలు చేసి విడుదల చేస్తేనే ఘన విజయం సాధిస్తున్నాయి’ అని సీనియర్‌ దర్శకుడు పేరరసు (Perarasu) అన్నారు. రెవ్‌జెన్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానరుపై దర్శకుడు గోకుల్‌ ప్రభు (Gokul Prabhu) ‘ఉన్‌ కూడవే...’ అనే ఆల్బమ్‌ సాంగ్‌ను రూపొందించారు. ఎంఎస్.జోన్స్‌ రూబర్ట్‌ సంగీతం అందించాడు. ఈ ప్రేమగీతంలో లెనిన్‌, సింధూరి హీరోహీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్‌ దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వి.ఉదయకుమార్‌, కోశాధికారి పేరరసులు అతిథులుగా హాజరై చిత్రబృందంతో కలిసి ఆల్బమ్‌ సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. జోన్స్‌ రూబర్ట్‌ మంచి సంగీతం అందించారని దర్శకుడు పేరరసు అభినందించారు.


దర్శకుడు ఆర్‌.వి.ఉదయకుమార్‌ మాట్లాడుతూ.. ‘చాలా మంచి పాట తీశారు. 4 నిమిషాల పాట కోసం యూనిట్‌ సభ్యులు చాలా కష్టపడ్డారు. అందరికీ నా శుభాకాంక్షలు’ అని అన్నారు. నిర్మాత దేవకుమార్‌ మాట్లాడుతూ.. ‘మనం చేసే పనిని చిత్తశుద్ధితో చేస్తే అందులో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. నటుడు లెనిన్‌, హీరోయిన్‌ సింధూరి చాలా కష్టపడ్డారంటూ జోన్స్‌కు అభినందనలు’ తెలిపారు. అలాగే, దర్శకుడు గోకుల్‌ రామ్‌, సంగీత దర్శకుడు జోన్స్‌ రూబర్ట్‌, హీరోయిన్‌ సింధూరి తదితరులు ప్రసంగించారు.

Updated Date - 2022-12-05T15:50:46+05:30 IST