పార్తిబన్ సింగిల్ షాట్ ఫిల్మ్ ‘ఇరవిన్ నిళల్’
ABN , First Publish Date - 2022-03-21T16:13:23+05:30 IST
దర్శకనటుడు, నిర్మాత ఆర్.పార్తిబన్ సింగిల్ షాట్ ఫిల్మ్ ‘ఇరవిన్ నిళల్’ ఫస్ట్‌లుక్‌ను పలువురు సినీ ప్రముఖులు తమతమ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ స్వరాలను సమకూర్చారు. ‘ప్రపంచంలోనే తొలిసారి ఒకే రాత్రిలో లీనియర్ సింగిల్ షాట్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ముగ్గురు అకాడెమీ అవార్డు విజేతలు పనిచేశారు. వారిలో ఒకరు రెహ్మాన్ కాగా, మిగిలిన ఇద్దరిలో ఒకరు కాట్టలాంగ్ లియోన్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా, సౌండ్ డిజైన్ విభాగంలో క్రెగ్ మ్యాన్ పనిచేశారు. ఇదిలా ఉండగా 1981లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన పార్తిబన్, 1989లో తొలిసారి దర్శకత్వం చేపట్టారు.

దర్శకనటుడు, నిర్మాత ఆర్.పార్తిబన్ సింగిల్ షాట్ ఫిల్మ్ ‘ఇరవిన్ నిళల్’ (రాత్రి నీడ) ఫస్ట్‌లుక్‌ను పలువురు సినీ ప్రముఖులు తమతమ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ స్వరాలను సమకూర్చారు. ‘ప్రపంచంలోనే తొలిసారి ఒకే రాత్రిలో లీనియర్ సింగిల్ షాట్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ముగ్గురు అకాడెమీ అవార్డు విజేతలు పనిచేశారు. వారిలో ఒకరు రెహ్మాన్ కాగా, మిగిలిన ఇద్దరిలో ఒకరు కాట్టలాంగ్ లియోన్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా, సౌండ్ డిజైన్ విభాగంలో క్రెగ్ మ్యాన్ పనిచేశారు. ఇదిలా ఉండగా 1981లో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన పార్తిబన్, 1989లో తొలిసారి దర్శకత్వం చేపట్టారు. ఈయన చివరగా దర్శకత్వం వహించిన ‘ఒత్త చెరుప్పు సైజు 7’. 2019లో విడుదలై, మూడు విభాగాల్లో జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. కాగా, పార్తిబన్ చివరగా 2021లో వచ్చిన ‘తుగ్లక్ దర్బార్’ చిత్రంలో కనిపించారు.