‘కాలేజ్‌ రోడ్డు’పై పా.రంజిత్‌ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-03-23T04:16:39+05:30 IST

విద్యా రుణాలు, వాటి వెనుక ఉన్న రాజకీయాలను నేపథ్యంగా చేసుకుని నిర్మించిన చిత్రం ‘కాలేజ్‌ రోడ్డు’. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు పా. రంజిత్‌ చిత్ర బృందాన్ని అభినందించారు. ‘కబాలీ’, ‘గజినీకాంత్‌’, ‘గుండు’ వంటి చిత్రాల్లో విలన్‌ పాత్రలో

‘కాలేజ్‌ రోడ్డు’పై పా.రంజిత్‌ ప్రశంసలు

విద్యా రుణాలు, వాటి వెనుక ఉన్న రాజకీయాలను నేపథ్యంగా చేసుకుని నిర్మించిన చిత్రం ‘కాలేజ్‌ రోడ్డు’. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు పా. రంజిత్‌ చిత్ర బృందాన్ని అభినందించారు. ‘కబాలీ’, ‘గజినీకాంత్‌’, ‘గుండు’ వంటి చిత్రాల్లో విలన్‌ పాత్రలో నటించిన లింగేష్‌ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ఇది కాక ప్రస్తుతం ఆయన రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. విద్యారుణాలు, వాటివెనుక ఉన్న రాజకీయాలు, సమాజంలోని సమస్యలను ఇతివృత్తంతో కామెడీ థ్రిల్లర్‌ మూవీగా ‘కాలేజ్‌ రోడ్డు’ నిర్మించారు. 


ఎంపీ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ జెయ్‌ అమర్‌సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆప్రో సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఇటీవల చూసిన దర్శకుడు పా.రంజిత్‌ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడే బాధలను అద్భుతంగా తెరకెక్కించారంటూ దర్శకుడిని ప్రశంసించారు. విద్యా రుణాలపై రాజకీయాల గురించి ప్రస్తావించినప్పటికీ పక్కా కమర్షియల్‌గా తెరకెక్కించారంటూ కొనియాడారు. 

Updated Date - 2022-03-23T04:16:39+05:30 IST