మధురై బ్యాక్‌డ్రాప్‌లో Kamal - pa. Ranjith చిత్రం

ABN , First Publish Date - 2022-05-17T19:38:48+05:30 IST

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamalhasan) యువ దర్శకులతో కలిసి పనిచేసేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ఇప్పటికే లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kangaraj) దర్శకత్వంలో ‘విక్రమ్‌’ (Vikram) చిత్రంలో నటించగా ఇది జూన్‌ 3న విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న దర్శకుడు పా.రంజిత్‌ మాట్లాడుతూ.. ‘ఆండవన్‌ (కమల్‌) హీరోగా మధురై బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం తెరకెక్కించాలన్నది నా ఆకాంక్ష.

మధురై బ్యాక్‌డ్రాప్‌లో  Kamal - pa. Ranjith చిత్రం

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ (Kamalhasan) యువ దర్శకులతో కలిసి పనిచేసేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ఇప్పటికే లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kangaraj) దర్శకత్వంలో ‘విక్రమ్‌’ (Vikram) చిత్రంలో నటించగా ఇది జూన్‌ 3న విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న దర్శకుడు పా.రంజిత్‌ మాట్లాడుతూ.. ‘ఆండవన్‌ (కమల్‌) హీరోగా మధురై బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రం తెరకెక్కించాలన్నది నా ఆకాంక్ష. దానిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఇది నెరవేరుతుందని భావిస్తున్నాను. మధురై బ్యాక్‌ డ్రాప్‌లో, మధురై యాసలో హీరో మాట్లాడేలా ఒక సంచలనం సృష్టించాలన్నదే కోరిక. మధురై నేపథ్యం అనగానే పంచె, చొక్కా అని భావించవద్దని హీరో కోటుసూటులో కూడా ఉండొచ్చు’ అని తెలిపారు. ఆ తర్వాత మాట్లాడిన కమల్‌.. పా.రంజిత్‌ కోరిక త్వరలోనే ఫలిస్తుందని తెలిపారు.


పా. రంజిత్ ఆల్రెడీ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth) హీరోగా ‘కబాలి (Kabali), కాలా (Kala)’ అనే రెండు చిత్రాల్ని వరుసగా తెరకెక్కించాడు. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో మ్యాజిక్ చేయలేకపోయాయి. అయినప్పటికీ  అతడి టాలెంట్‌పై కమల్ హాసన్ లాంటి హీరోలు నమ్మకంగా ఉండడం ఆశ్చర్యమనిపించకమానదు. పా.రంజిత్ ప్రస్తుతం మలయాళ హీరో కాళిదాస్ జయరామ్ తో ‘నక్షత్రం నగర్గిరదు’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కంప్లీట్ అయ్యాకా..  కమల్ చిత్రం స్ర్కిప్ట్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మరి రజినీతో సరైన హిట్ అందుకోలేకపోయిన పా.రంజిత్ కమల్ తోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.  

Updated Date - 2022-05-17T19:38:48+05:30 IST

Read more