Oscar అవార్డు విన్నర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు..!
ABN , First Publish Date - 2022-05-27T21:58:06+05:30 IST
‘ద యూస్‌వల్ సస్పెక్ట్స్’(The Usual Suspects), ‘అమెరికన్ బ్యూటీ’(American Beauty) వంటి సినిమాల్లో నటించి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీ(Kevin Spacey). కెవిన్ లైంగిక

‘ద యూస్‌వల్ సస్పెక్ట్స్’(The Usual Suspects), ‘అమెరికన్ బ్యూటీ’(American Beauty) వంటి సినిమాల్లో నటించి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీ(Kevin Spacey). కెవిన్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొటున్నాడు. అతడికీ వ్యతిరేకంగా అభియోగాలు నమోదు కావడంతో మే 26న బ్రిటన్ పోలీసులు ఛార్జిషీటును దాఖలు చేశారు. ‘మీటూ మూవ్‌మెంట్’(MeToo movement)లో భాగంగా మొదటి సారిగా ఈ హాలీవుడ్ నటుడిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లోనే లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
బ్రిటన్‌కు చెందిన ‘ద క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్’(సీపీఎస్) (The Crown Prosecution Service) కేసును దర్యాప్తు చేసి ఓ ప్రకటనను జారీ చేసింది. ‘‘కెవిన్ ముగ్గురు వ్యక్తులపై నాలుగు సార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అంగీకారం లేకుండా లైంగిక చర్య జరిపాడు’’ అని సీపీఎస్‌కు స్పెషల్ క్రైమ్ డివిజన్ హెడ్ ఐన్స్లీ పేర్కొన్నారు. లండన్‌లో మొదటిసారిగా 2005, మార్చిలో ఓ వ్యక్తిని రెండుసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. లండన్‌లోనే 2008, ఆగస్టులో రెండో వ్యక్తితో మూడో సారి లైంగిక చర్యలో పాల్గొన్నాడు. ఇంగ్లాండ్‌లో 2013, ఏప్రిల్‌లో మూడో వ్యక్తితో నాలుగోసారి సెక్స్ జరిపాడు. ఇంగ్లీష్ చట్టాల ప్రకారం బాధితులను ఇప్పటి వరకు గుర్తించలేదు. స్పేసీపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ‘హౌస్ ఆఫ్ కార్డ్స్’(House of Cards) చివరి సీజన్ నుంచి అతడిని నెట్‌ఫ్లిక్స్ గతంలోనే తొలగించింది. మరో బయోపిక్ నుంచి కూడా అతడిని రీ ప్లేస్ చేసింది. గతంలో అమెరికాలో అతడిపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని తోసిపుచ్చాడు.