మరోసారి Vijay - Samantha..?

ABN , First Publish Date - 2022-06-04T19:09:48+05:30 IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలలో సమంత (Samantha) సాధించిన క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. ఇటు తెలుగులో అటు తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటించి భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

మరోసారి  Vijay - Samantha..?

సౌత్ సినిమా ఇండస్ట్రీలలో సమంత (Samantha) సాధించిన క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. ఇటు తెలుగులో అటు తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటించి భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. కమర్షియల్ సినిమా అంటే ముందు సమంత పేరునే పరిశీలిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన రెండుమూడు సార్లు నటించారు. ప్రస్తుతం సమంత చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో నటించిన 'శాకుంతలం' (Shaakuntalam) పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. 


'యశోద' (Yashoda), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన నటిస్తున్న 'ఖుషి' (Khushi) చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే, తాజాగా సమంతకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) సరసన హీరోయిన్‌గా మరోసారి అవకాశం అందుకుందట. ఇటీవలే 'బీస్ట్' (Beast) సినిమాతో వచ్చి హిట్ అందుకున్న విజయ్, ప్రస్తుతం తెలుగులో ఎంట్రీ ఇస్తూ ఓ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ రెండవ షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో నిర్మిస్తున్న దీనికి వంశీ పైడిపల్లి (vamsi paidipally) దర్శకత్వం వహిస్తున్నారు.


తాజాగా 'విక్రమ్' సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్ నెక్స్ట్ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా రానుందని సమాచారం. ఇప్పటికే విజయ్ - సమంత కలిసి 'తేరి', 'మెర్సెల్', 'కత్తి' చిత్రాలలో నటించారు. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. లోకేష్ సినిమాలో విజయ్ సరసన సమంత నటించేది నిజం అయితే ఇది నాలుగో చిత్రం అవుతుంది. 

Updated Date - 2022-06-04T19:09:48+05:30 IST

Read more