సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయకాంత్‌ను ఇలా చూసి ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు..!

ABN, First Publish Date - 2022-03-02T19:06:33+05:30

కోలీవుడ్‌లో 1980-90 దశకంలో యాక్షన్‌ హీరోగా కొనసాగిన విజయకాంత్‌ ఇపుడు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమిత మయ్యారు. ఈ కారణంగా ఆయన ఆకారం, ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌లో 1980-90 దశకంలో యాక్షన్‌ హీరోగా కొనసాగిన విజయకాంత్‌ ఇపుడు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమిత మయ్యారు. ఈ కారణంగా ఆయన ఆకారం, ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోను చూస్తే, ఈయన నిజంగానే విజయకాంతేనా? అనే సందేహం ప్రేక్షకులకే కాదు ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలకు వస్తోంది. కోలీవుడ్‌లో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ హవా కొనసాగుతున్న తరుణంలోనూ విజయకాంత్‌కు కూడా ప్రత్యేక ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కొనసాగింది. 


ప్రధానంగా కుటుంబ, పోలీస్‌ కథా చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరించారు. ఆ తర్వాత సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి డీఎండీకే పార్టీని స్థాపించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలోనే ఆమెకు ధీటుగా రాజకీయ పావులు కదిపారు. అయితే, ఆయన అనారోగ్యం బారినపడటంతో క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కాంత్‌కు చెందిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Updated Date - 2022-03-02T19:06:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!