Nivin Pauly : ఆసక్తికరంగా ‘తురముఖం’ మూవీ ట్రైలర్

ABN , First Publish Date - 2022-05-23T15:11:58+05:30 IST

మాలీవుడ్ యంగ్ సూపర్‌స్టార్స్‌లో నివీన్ పాలీ ( Nivin Pauly ) చాలా ప్రత్యేకం. వైవిధ్యమైన కథాంశాలతో, విలక్షణమైన పాత్రతో మెప్పించే ఈ హీరో.. తాజాగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘తురముఖం’ (Thuramukham) (నౌకాశ్రయం). రాజీవ్ రవి (Rajiv Ravi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెక్కేపేట్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంది. నిమిషా సజయన్ , జోజు జార్జ్, ఇంద్రజిత్ సుకుమారన్, సుదేవ్ నాయర్, దర్శనా రాజేంద్రన్, అర్జున్ అశోకన్, మణికంఠన్ ఆచారి, సెంథిల్ కృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Nivin Pauly : ఆసక్తికరంగా ‘తురముఖం’ మూవీ ట్రైలర్

మాలీవుడ్ యంగ్ సూపర్‌స్టార్స్‌లో నివీన్ పాలీ ( Nivin Pauly ) చాలా ప్రత్యేకం.  వైవిధ్యమైన కథాంశాలతో, విలక్షణమైన పాత్రలతో మెప్పించే ఈ హీరో..  తాజాగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘తురముఖం’ (Thuramukham) (నౌకాశ్రయం). రాజీవ్ రవి (Rajiv Ravi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెక్కేపేట్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంది. నిమిషా సజయన్ , జోజు జార్జ్, ఇంద్రజిత్ సుకుమారన్, సుదేవ్ నాయర్, దర్శనా రాజేంద్రన్, అర్జున్ అశోకన్, మణికంఠన్ ఆచారి, సెంథిల్ కృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కరోనా కారణంగా చాలా ఆలస్యంగా థియేటర్స్ లోకి వస్తోంది. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అభిమానుల్ని ఎంతగానే ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


కేయం చిదంబరం (KM Chidambaram) రచించిన ‘తురముఖం’ (Thuramukham) నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కేరళలోని కొచ్చి సముద్రతీరాన్ని, నౌకాశ్రయాన్ని నమ్ముకొని ఎందరో బతుకుంటారు. అలాంటి వాళ్ళను అణగద్రొక్కే ప్రయత్నం చేస్తూ, వారి వ్యాపారాన్ని చేసుకోనివ్వకుండా, ఇబ్బందులు పెట్టే బడా వ్యాపారస్తులపై తిరుగుబాటు చేస్తాడు ఓ యువకుడు. చివరికి ఆ నౌకాశ్రయం ఎవరి సొత్తు అయింది ? అన్నదే మిగతా కథ. 40ల్లో కొచ్చీలోని మట్టాంచేరీలో జరిగిన యదార్ధ సంఘటనల సమాహారమే ఈ సినిమా. మాట్టాంచేరీ మౌదుగా నివీన్ పాలీ నటిస్తున్న ఈ సినిమాకి కె, షహనాజ్ అమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ పాలీ (Nivin Pauly) కి ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. మరి ఈ సినిమాతో నివీన్ ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-05-23T15:11:58+05:30 IST

Read more