సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Russia-Ukraine War Effect: రష్యన్ సినీ కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్ నిషేధం.. భవిష్యత్తులో..

ABN, First Publish Date - 2022-03-03T19:04:22+05:30

గతవారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చిన్న దేశమైన ఉక్రెయిన్ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతవారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చిన్న దేశమైన ఉక్రెయిన్ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ప్రపంచంలోని ఆయా దేశాలు రష్యాపై వివిధ రకాలుగా ఆంక్షలు విధిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రైవేటు సంస్థలు సైతం ఆ దేశంపై  చర్యలు తీసుకుంటున్నాయి.


ఇప్పటికే డిస్నీ, వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థలు రష్యాలో తమ సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌‌ఫ్లిక్స్ సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ఇక నుంచి రష్యాకి సంబంధించిన ఎటువంటి కంటెంట్‌ని కొనమని ఆ సంస్థ మేనేజ్‌మేంట్ ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటికే ఒప్పందం కుదిరిన నాలుగు వెబ్‌సిరీస్‌లపై సైతం ఈ నిర్ణయాన్నే అమలు చేయనుంది. అందులో దాషా ఝుక్ దర్శకత్వం వహిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన ఒప్పందాన్ని మాత్రం ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచింది. అయితే భవిష్యత్తులో ఎలా ఉంటుందనే విషయంపై ఆ యుద్ధం ముగిసిన తర్వాతే ఓ క్లారిటీ వస్తుంది.

Updated Date - 2022-03-03T19:04:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!