Nayanathara - Vighnesh Shivan : పెళ్ళి శుభలేఖ ఇదే !
ABN, First Publish Date - 2022-05-29T17:39:14+05:30
కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లవర్స్.. నయన తార (Nayanathara) , విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) లు ప్రస్తుతం తమ పెళ్ళి సన్నాహాల్లో ఉన్నారు. జూన్ 9న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ముందుగా తమ వివాహాన్ని తిరుపతిలో చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఫైనల్ గా వారి వివాహ వేదిక మారింది. చెన్నైకి దగ్గరలో ఉన్న మహాబలిపురంలో జరగబోతుండడం విశేషం.
కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లవర్స్.. నయన తార (Nayanathara) , విఘ్నేష్ శివన్ (Vighnesh Shivan) లు ప్రస్తుతం తమ పెళ్ళి సన్నాహాల్లో ఉన్నారు. జూన్ 9న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ముందుగా తమ వివాహాన్ని తిరుపతిలో చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఫైనల్ గా వారి వివాహ వేదిక మారింది. చెన్నైకి దగ్గరలో ఉన్న మహాబలిపురంలో జరగబోతుండడం విశేషం. దాదాపు ఏడు సంవత్సరాల ప్రేమ వారిది. 2015లో మొట్టమొదటి సారిగా ‘నానుమ్ రౌడీ దాన్’ (నేనూ రౌడీనే) చిత్రం సెట్లో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు విఘ్నేష్ శివనే. ఈ సినిమా తర్వాత నయన్, విఘ్నేష్‌ల ప్రేమ వ్యవహారం జనానికి తెలిసింది. నిజానికి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన నయనతార పదకొండేళ్ళక్రితం శాస్త్రోక్తంగా హిందూ ధర్మాన్ని స్వీకరించింది. విష్నేశ్ శివన్ ఎలాగూ హిందూ ఫ్యామిలీలో పుట్టాడు. అందుకే వీరి వివాహానికి ఎలాంటి అడ్డంకి రాలేదు. లాస్టియర్ ఈ ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగింది. కానీ విషయం అంతగా బైటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అంతేకాదు.. వారి పెళ్ళి శుభలేఖను కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేయించారు.
ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్ళి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం డిజిటల్ ఫార్మేట్ లోనే ఆహ్వాన పత్రికను డిజైన్ చేయడం విశేషం. పెళ్ళి కార్డ్ లో నయన్ అండ్ విక్కీ అని సింపుల్ గా వీరిద్దరి పేర్లూ కనిపిస్తున్నాయి. మోషన్ పోస్టర్ స్టైల్లో రివీలవుతున్న ఈ శుభలేఖకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. విజయ్ సేతుపతి, సమంత, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తదితర కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ పెళ్ళికి రాబోతున్నారని టాక్. తమిళంలో ‘ఓ2’ (O2) మూవీలోనూ, అజిత్ (Ajith) 62వ చిత్రంలోనూ, మలయాళంలో పృధ్విరాజ్ (Pridhviraj) హీరోగా ‘గోల్డ్’ (Gold) అనే మూవీలోనూ, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రంలోనూ ప్రస్తుతం నయనతార నటిస్తోంది. పెళ్ళి తర్వాత ఆమె వెండితెరపైకి ఎప్పుడు తిరిగి వస్తుంది అనే విషయంలో ఆసక్తి నెలకొంది.