హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో మోడల్స్ సందడి

ABN , First Publish Date - 2022-12-08T01:45:39+05:30 IST

బంజారాహిల్స్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో 7, 8న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. అరబిందో రియాల్టీ సమర్పణలో

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో మోడల్స్ సందడి

బంజారాహిల్స్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో 7, 8న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. అరబిందో రియాల్టీ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్‌లతో ప్రముఖ డిజైనర్ మందిరా వీర్క్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు‌పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ర్యాంప్‌ను పూబంతులతో తీర్చిదిద్దారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు ఆలియా డిబ, కౌశికి కొచ్చర్, యాక్సి దీప్తి రెడ్డి, నరేంద్ర కుమార్‌లకు చెందిన డిజైన్  కలెక్షన్స్‌లో మోడల్స్ వావ్ అనిపించారు. దాదాపు 16 మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను ఈ రెండు రోజుల ప్రదర్శనలో చూపనున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ముంబై, ఢిల్లీకి చెందిన పలువురు మోడల్స్ ఈ ర్యాంపుపై సందడి చేశారు.Updated Date - 2022-12-08T01:45:39+05:30 IST

Read more