సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

MI7 part 1 Trailer : ఈ సారి ‘డెడ్ రెకనింగ్’ అంటున్న టామ్‌క్రూజ్

ABN, First Publish Date - 2022-05-24T16:49:01+05:30

హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) అన్న సంగతి తెలిసిందే. టామ్ క్రూజ్ (Tom cruise), సైమన్ పెగ్ (siman peg), రెబెక్కా ఫెర్గూసన్ (Rebecca Ferguisen) లాంటి సీక్రెట్ ఏజెంట్స్ .. తమదేశానికి ముప్పు వాటిల్లిన ప్రతీసారీ అసాధ్యం అనుకున్న మిషన్‌ను చేపట్టి.. తమ సాహసాలతో సుసాధ్యం అయ్యేలా చేస్తారు. ఇప్పటి వరకూ ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో మొత్తం ఆరు చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ ప్రపంచ ప్రేక్షకుల్ని అబ్బురపరిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’  (Mission Impossible) క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. టామ్ క్రూజ్ (Tom cruise), సైమన్ పెగ్ (siman peg), రెబెక్కా ఫెర్గూసన్ (Rebecca Ferguisen) లాంటి సీక్రెట్ ఏజెంట్స్ .. తమదేశానికి ముప్పు వాటిల్లిన ప్రతీసారీ అసాధ్యం అనుకున్న మిషన్‌ను చేపట్టి.. తమ సాహసాలతో సుసాధ్యం అయ్యేలా చేస్తారు. ఇప్పటి వరకూ ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో మొత్తం ఆరు చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ ప్రపంచ ప్రేక్షకుల్ని అబ్బురపరిచాయి. ఈ ఫ్రాంచైస్‌లో ఇప్పుడు ఏడు, ఎనిమిది భాగాలు కూడా  ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. సీక్రెట్ ఏజెంట్ ఈథన్ హంట్ ‌(Ethen Hunt) గా టామ్‌క్రూజ్ తన అసాధారణమైన టాలెంట్‌తో సాహసోపేతమైన స్టంట్స్‌తో ప్రపంచ సినీ ప్రేమికుల్ని అలరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ లో ఏడవ భాగం ‘డెడ్ రెకనింగ్’  (Dead Reckoning) పార్ట్ వన్ ట్రైలర్ విడుదలైంది. వచ్చే ఏడాది జూలైలో ప్రపంచ ప్రేక్షకుల్ని అబ్బుర పరచబోతోంది ఈ సినిమా.


ఈ ట్రైలర్ లోనూ గత చిత్రాల్లో మాదిరిగానే..  టామ్ క్రూజ్ చేసే డెడ్లీ ఛేజింగ్స్, స్టంట్స్ అబ్బుర పరుస్తాయి. MI7 పార్ట్ వన్ లోని.. ఈ మొదటి ట్రైలర్ కళ్ళుచెదిరే విజువల్స్‌తో థ్రిల్ చేస్తోంది. రైలు పట్టాలనుంచి డీప్ ఎండ్ లోకి వెళుతున్నట్టు చూపించడం.. టామ్ మోటార్ బైక్ నడుపుతూ కొండపై నుంచి దూకడం నెవర్ బిఫోర్ అనిపిస్తుంది. కేవలం యాక్షన్ అండ్ స్టంట్స్‌తో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ‘డెడ్ రికనింగ్’ (Dead Reckoning) పార్ట్ 1,  2023 జూలై 14న థియేటర్స్ లో విడుదల కానుండగా.. పార్ట్ 2.. 2024 జూన్ 28న విడుదల కానుండడం విశేషం. క్రిస్టఫర్ మెక్ క్వారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టామ్‌క్రూజ్ (Tom cruise) కెరీర్ లో మరో మెమరబుల్ హిట్ అవుతుందని వేరే చెప్పాలా.. 



Updated Date - 2022-05-24T16:49:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!