సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

House of The Dragon: రెండో సీజన్‌లో మార్వెల్ స్టార్.. స్పందించిన నటి..

ABN, First Publish Date - 2022-10-01T00:39:28+05:30

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones). హెచ్‌బీవో(HBO) నిర్మించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game Of Thrones). హెచ్‌బీవో(HBO) నిర్మించింది. ఈ షో సక్సెస్ సాధించడంతో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కు ప్రీక్వెల్ నిర్మిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ప్రీక్వెల్‌కు ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ (House of The Dragon) అని టైటిల్ పెట్టింది. ఈ షో ఆగస్టు 21 నుంచి హెచ్‌బీవోలో స్ట్రీమింగ్ అవుతుంది. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. ఈ షో మొదటి సీజన్ పూర్తి కాకముందే రెండో సీజన్‌ను నిర్మిస్తున్నట్టు హెచ్‌బీవో ప్రకటించింది. రెండో సీజన్‌లో కీలక పాత్ర‌లను మార్వెల్ స్టార్ ఎలిజబెత్ ఒస్లోన్ (Elizabeth Olsen), హెన్రీ కావిల్ (Henry Cavill) పోషించనున్నట్టు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.      


హాలీవుడ్ నటి ఎలిజబెత్ ఒస్లోన్ మార్వెల్ సినిమాల్లో విండా మాక్సిమాఫ్ (వాండా విసన్) గా మెప్పించింది. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ కోసం మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వెలువడగానే ఆమె అభిమానులందరు ఖుషి అయిపోయారు. తాజాగా ఎలిజబెత్ లాస్ ఏంజెలిస్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ వార్తలపై స్పందించింది. ‘‘ఆ షోలో నటిస్తున్నానని నేను అనుకోవడం లేదు. ఈ వార్తలు ఏలా మొదలవుతాయో నాకు తెలియదు. ఇటువంటి కథనాలను చూసి అభిమానులందరు నేను నటిస్తున్నానని అనుకుంటారు’’ అని ఎలిజబెత్ ఒస్లోన్ తెలిపింది. ‘గేమ్ ఆఫ్ ద థ్రోన్స్’ లో రెనిరా టార్గారియన్‌ (Rhaenyra Targaryen) పాత్రను ఎమిలా క్లార్క్ పోషించింది. గతంలో ఈ పాత్ర కోసం ఎలిజబెత్‌ను ఆడిషన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆమె ఎంపిక కాలేదు.  మార్టిన్ రాసిన ‘ఫైర్ అండ్ బ్లడ్’ (Fire and Blood) నవలగా ఆధారంగా చేసుకుని ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ ను రూపొందించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కు 200ఏళ్ల ముందు జరిగిన ఘటనలను ఈ ప్రీక్వెల్‌లో చూపిస్తున్నారు. ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ లో పాడీ కన్సిడైన్, మాట్ స్మిత్, ఒలివియా కుక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


Updated Date - 2022-10-01T00:39:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!