Manju Warrier: అజిత్ కోసం గాయనిగా మారిన మలయాళీ హీరోయిన్
ABN , First Publish Date - 2022-11-28T17:40:13+05:30 IST
తమిళ హీరో అగ్రహీరో అజిత్ కుమార్ (Ajith Kumar), దర్శకుడు హెచ్.వినోద్ (H.Vinoth) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తుణివు’..

తమిళ హీరో అగ్రహీరో అజిత్ కుమార్ (Ajith Kumar), దర్శకుడు హెచ్.వినోద్ (H.Vinoth) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తుణివు’ (Tunivu). బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor), జీస్టూడియోస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఓ పాటని మలయాళీ హీరోయిన్ మంజు వారియర్ (Manju Warrior) పాడింది. ఆ పాటతో మొదటి సారి అజిత్ కోసం గాయనిగా అవతారమెత్తింది.

పంజాబ్ రాష్ట్రంలో 1987 సంవత్సరంలో జరిగిన ఒక బ్యాంకు దోపిడీ నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఓ పాటను పాడినట్లు మంజు వారియర్ సోషల్ మీడియాలో వేదికగా తెలిపింది.
