ఆ రోజే ‘పొన్నియన్ సెల్వన్-1’ టీజర్..!

ABN , First Publish Date - 2022-06-19T02:13:12+05:30 IST

భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగణంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ రెండు భాగాలుగా

ఆ రోజే ‘పొన్నియన్ సెల్వన్-1’ టీజర్..!

భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా టీజర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.   


‘పొన్నియన్ సెల్వన్’ టీజర్‌ను జులై మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. తంజావురూలోని  ప్రఖ్యాత బృహదీశ్వరాలయంలో జులై 7న టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ ఈవెంట్ అనంతరం దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌ను చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఆడియోను విదేశాల్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), జయం రవి (Jayam Ravi), కార్తి (Karthi), జయరాం (Jayaram), ప్రకాష్ రాజ్ (Prakash Raj), ప్రభు (Prabhu), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai),  త్రిష (Trisha), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తున్నాడు. ప్రొడక్షన్ డిజైనర్‌గా తోట తరణి పనిచేస్తున్నాడు. ‘పొన్నియన్ సెల్వన్ -2’ ను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.

Updated Date - 2022-06-19T02:13:12+05:30 IST

Read more