ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తండ్రీకొడుకుల సినిమాలు

ABN , First Publish Date - 2022-03-17T17:05:49+05:30 IST

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రీసెంట్ గా ‘భీష్మపర్వం’ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. అందులో అనసూయ కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక గతేడాది మమ్ముట్టి తనయుడు దుల్ఖర్ సల్మాన్ ‘కురుప్’ పాన్ ఇండియా చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అలా .. తండ్రీ కొడుకుల చిత్రాలు రెండూ థియేటర్స్ లో విడుదలై.. రికార్డ్ వసూళ్ళు కురిపించి అభిమానుల్ని ఖుషీ చేశాయి. ఇక ఈ ఇద్దరి తాజా చిత్రాలు.. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుండడం విశేషమని చెప్పాలి. అంతేకాదండోయ్.. ఈ రెండు సినిమాలూ డైరెక్ట్ గా స్ట్రీమ్ అయ్యే ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ అవడం మరో విశేషం. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలకు మరో ప్రత్యేకత ఉంది. ఈ రెండింట్లోనూ తండ్రీ కొడుకులిద్దరూ పోలీస్ ఆఫీసర్స్ గా నటించనుండడం ఇంకా విశేషం.

ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తండ్రీకొడుకుల సినిమాలు

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రీసెంట్ గా ‘భీష్మపర్వం’ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. అందులో అనసూయ కీలక పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక గతేడాది మమ్ముట్టి తనయుడు దుల్ఖర్ సల్మాన్ ‘కురుప్’ పాన్ ఇండియా చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అలా తండ్రీ కొడుకుల చిత్రాలు రెండూ థియేటర్స్ లో విడుదలై..  రికార్డ్ వసూళ్ళు కురిపించి అభిమానుల్ని ఖుషీ చేశాయి.  ఇక ఈ ఇద్దరి తాజా చిత్రాలు.. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుండడం విశేషమని చెప్పాలి. అంతేకాదండోయ్.. ఈ రెండు సినిమాలూ డైరెక్ట్ గా స్ట్రీమ్ అయ్యే  ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ అవడం మరో విశేషం. ఇంకా ఈ రెండు సినిమాలకు మరో ప్రత్యేకత ఉంది. ఈ రెండింట్లోనూ తండ్రీ కొడుకులిద్దరూ పోలీస్ ఆఫీసర్స్ గా నటించనుండడం ఇంకా విశేషం. 


దుల్ఖర్ సల్మాన్ పోలీసాఫీసర్ గా రేపే ( మార్చ్ 18న ) సోనీ లివ్ లో డైరెక్ట్ గా విడుదల కానున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘సెల్యూట్’. దుల్ఖర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాకి రోషన్ ఆండ్రూస్ దర్శకుడు. బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ కథానాయికగా నటిస్తోంది. ఇదివరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మమ్ముట్టి పోలీస్ గా రతీనా పీటీ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘పుళు’ ( పురుగు). ఇందులో పార్వతీ తిరువోత్తు కీలక పాత్ర పోషిస్తోంది. నిజానికి ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దుల్ఖర్ సల్మాన్ ‘సెల్యూట్’ విడుదలయ్యాకా.. పుళు చిత్రం విడుదల తేదీని నిర్ణయించబోతున్నారు. మరి తండ్రీకొడుకుల చిత్రాలు రెండూ అభిమానుల్ని ఏ స్థాయిలో థ్రిల్ చేస్తాయో చూడాలి.  

Updated Date - 2022-03-17T17:05:49+05:30 IST

Read more