పాట పాడుతూ... స్టేజీపైనే కుప్పకూలిన సీనియర్ సింగర్...

ABN , First Publish Date - 2022-06-01T04:19:12+05:30 IST

వేదిక మీద పాట పాడుతూ... అలానే కుప్పకూలిపోయారు మలయాళ గాయకుడు ఎడవ బషీర్. ‘భీమాస్ బ్లూ డైమండ్ ఆర్కేస్ట్రా’ 50వ వార్షికోత్సవం సందర్భంగా మే 28న ఓ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొన్న 78 ఏళ్ల బషీర్ హఠాత్తుగా నేలకూలారు.

పాట పాడుతూ... స్టేజీపైనే కుప్పకూలిన సీనియర్ సింగర్...

వేదిక మీద పాట పాడుతూ... అలానే కుప్పకూలిపోయారు మలయాళ గాయకుడు ఎడవ బషీర్. ‘భీమాస్ బ్లూ డైమండ్ ఆర్కేస్ట్రా’ 50వ వార్షికోత్సవం సందర్భంగా మే 28న ఓ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొన్న 78 ఏళ్ల బషీర్ హఠాత్తుగా నేలకూలారు. 

భీమాస్ బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా టీమ్ లో గతంలో మెంబర్ గా ఉన్న బషీర్ 1977 నాటి హిందీ చిత్రం ‘టూటే ఖిలౌనే’లోంచి ‘మానా హో తుమ్ బేహద్ హసీనా’ పాట పాడుతూ కిందపడిపోయారు. యేసుదాస్ పాడిన అలనాటి గీతమే ఆయనకు చివరి పాటగా మిగిలిపోయింది. వేదిక మీద కుప్పకూలిన బషీర్ ని దగ్గర్లోని హాస్పిటల్ కి హుటాహుటిన తీసుకు వెళ్లగా డాక్టర్లు ఆయన అప్పటికే మరణించాడని ప్రకటించారు. 

ఎడవ బషీర్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటంటూ కేరళ ముఖ్యమంత్రి తమ సంతాపాన్ని తెలిపారు. కాగా, దివంగత మలయాళ గాయకుడు 1978లో ‘వీణ వాయిక్కుమ్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1972లో ఆయన ‘కొల్లామ్ సంగీతాలయ గానమేలా ట్రూప్’ స్థాపించారు. 

Updated Date - 2022-06-01T04:19:12+05:30 IST

Read more