విలనా..? హీరోనా..? Kamal Haasan Vikram సినిమాలో తన క్యారెక్టర్ ఏంటన్నది చెప్పేసిన Vijay Sethupathi

ABN , First Publish Date - 2022-05-08T01:16:56+05:30 IST

విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలతో అభిమానులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). అభిమానులందరు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ (makkal selvan) అని

విలనా..? హీరోనా..? Kamal Haasan Vikram సినిమాలో తన క్యారెక్టర్ ఏంటన్నది చెప్పేసిన Vijay Sethupathi

విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). అభిమానులందరు ముద్దుగా ‘మక్కల్ సెల్వన్’ (makkal selvan) అని పిలుస్తుంటారు. ‘విక్రమ్ వేద’ (vikram vedha), ‘సూపర్ డీలక్స్’ (super deluxe), ‘మాస్టర్’ (master) వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ‘ఉప్పెన’ (uppena) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. అతడు తాజగా నటించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). విశ్వ నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan) హీరోగా నటించాడు. ఫహద్ ఫాజిల్ ( fahadh faasil )కీలక పాత్రను పోషించాడు. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించాడు. తాజాగా విజయ్ సేతుపతి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులకు వివరించాడు. ‘విక్రమ్’ మూవీలో తన పాత్ర గురించి కూడా పేర్కొన్నాడు. మానవులోని చీకటి కోణాన్ని అన్వేషించడమంటే తనకిష్టమని విజయ్ తెలిపాడు. రియల్ లైఫ్‌లో అలా జీవించలేం కాబట్టి, తెరపై నెగెటివ్ పాత్రలను పోషిస్తున్నానని వెల్లడించాడు. 


‘మాస్టర్’, ‘ఉప్పెన’ సినిమాల్లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల్లోని విలన్ పాత్రలు వేటికవే ప్రత్యేకమని అతడు స్పష్టం చేశాడు. నెగిటివ్ రోల్స్‌లో కనిపించినప్పటికీ ఒకే విధమైనవి చేయనని చెప్పాడు. ‘విక్రమ్’ లోను విలన్‌గా కనిపిస్తానన్నాడు. ఇప్పటి వరకు అటువంటి పాత్ర పోషించలేదన్నాడు. ‘‘..‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్ వంటి గొప్ప నటులతో కలసి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ ప్రాజెక్టుకు నేను కొంచెం విలువ చేకూర్చానని అనుకుంటున్నాను. ఈ పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కమల్ హాసన్‌కు నేను చాలా కాలంగా అభిమానిని. ఈ మూవీతో అతడి నటనను దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది. డైలాగ్స్ కంటే ఎమోషన్స్‌కు నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అందువల్లే హిందీ సినిమా ‘గాంధీ టాక్స్’ లో నటించాను. ‘గాంధీ టాక్స్’ సైలెంట్ ఫిలిమ్. అందులో డైలాగ్స్ ఉండవు’’ అని విజయ్ సేతుపతి స్పష్టం చేశాడు.

Updated Date - 2022-05-08T01:16:56+05:30 IST

Read more