మా లవ్‌కు బ్రేకప్ జరిగిపోయింది: యంగ్ హీరోయిన్

ABN , First Publish Date - 2022-04-08T01:57:38+05:30 IST

‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో ప్రేమ జంట విడిపోయింది. ఆ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి ప్రేమ ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రేమబంధం తెగిపోయింది. ఈ విషయాన్ని..

మా లవ్‌కు బ్రేకప్ జరిగిపోయింది: యంగ్ హీరోయిన్

‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో ప్రేమ జంట విడిపోయింది. ఆ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి ప్రేమ ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రేమబంధం తెగిపోయింది. ఈ విషయాన్ని లోస్లియ స్వయంగా వెల్లడించింది. ఇదే అంశంపై ఆమె తాజాగా స్పందిస్తూ, ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఉన్నపుడు కవిన్‌కు నాకు మధ్య ఏదో తెలియని ఆకర్షణ (ప్రేమ) ఉన్న మాట నిజమే. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేమిద్దరు ప్రేమికులుగా కొనసాగినన్పటికీ మా ఆలోచనలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయి. అందుకే ఇపుడు మేమిద్దరం వేర్వేరు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాం. అంటే, కవిన్‌తో ఉన్న లవ్‌కు బ్రేకప్‌ జరిగిపోయింది.. అని లోస్లియ వెల్లడించింది. 


కాగా, శ్రీలంకలో టీవీ న్యూస్‌ రీడర్‌గా పని చేసిన లోస్లియా మరియనేశన్‌ ‘బిగ్‌బాస్‌ తమిళ సీజన్‌-3’ ద్వారా గుర్తింపుపొందింది. ఈ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిన్‌తో కలిసి ‘ఫ్రెండ్‌షిప్‌’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె ఇపుడు ప్రముఖ దర్శకుడు కేఎస్.రవికుమార్‌ నిర్మాతగా నిర్మించిన ‘గూగుల్‌ కుట్టప్పన్‌’ చిత్రంలో దర్శన్‌ సరసన నటించింది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. 

Updated Date - 2022-04-08T01:57:38+05:30 IST

Read more