సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kamal Haasan నుంచి ‘విక్రమ్’ సినిమా దర్శకుడు Lokesh Kanagaraj కు ‘Lifetime Settlement Letter’

ABN, First Publish Date - 2022-06-07T19:42:16+05:30

తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్’....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకుడు. జూన్ 3న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.175 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో డైరెక్టర్ లోకేశ్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఆయన టేకింగ్‌ని మెచ్చుకుంటూ పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి లోకేశ్‌కి ఓ ప్రశంసాపత్రం అందింది. దాన్ని ‘లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్ లెటర్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన లోకేశ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.


లోకేశ్ చేసిన పోస్ట్‌కి.. ‘లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్ లెటర్.. ఇది చదువుతున్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో నేను మాటల్లో చెప్పలేను. నంద్రీ అందావారే (ధన్యవాదాలు ప్రభూ) కమల్ హాసన్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే.. ఆ లెటర్ తమిళంలో ఉండడం వల్ల అందులో ఏముందో అర్థం చేసుకోవడానికి ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడానికి సైతం పలువురు నెటిజన్లు ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. దీంతో ఇతర భాషల్లోని ఆయన అభిమానులు నిరాశ చెందారు.. కాగా.. లోకేశ్ కార్తీతో ఖైదీ మూవీకి సీక్వెల్‌గా ఖైదీ 2ని, అలాగే విక్రమ్‌లో అతిథి పాత్ర కింగ్‌పిన్ రోలెక్స్ పాత్రలో మెరిసిన సూర్యతో ఓ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే.. వీటిపై ఇంతవరకు లోకేశ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. విక్రమ్ సినిమా తర్వాత ఆ సినిమాల గురించి ఏదో ఒక అనౌన్స్‌మెంట్ చేయాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.



Updated Date - 2022-06-07T19:42:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!