అమ్మమ్మగారి దేశానికి... టైటానికి హీరో 77 కోట్ల విరాళం!

ABN , First Publish Date - 2022-03-09T02:03:13+05:30 IST

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఉక్రెయిన్ దేశానికి హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో భారీ విరాళం ప్రకటించాడు. 10 మిలియన్ అమెరికన్ డాలర్లు... అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 77 కోట్లు డోనేట్ చేశాడు. అయితే, ఈ దానం వెనుక కేవలం డికాప్రియో రష్యా వ్యతిరేకత మాత్రమే లేదు. ఉక్రెయిన్‌పై ‘టైటానికి’ స్టార్‌కి ప్రత్యేక ప్రేమ...

అమ్మమ్మగారి దేశానికి... టైటానికి హీరో 77 కోట్ల విరాళం!
అమ్మ, అమ్మమ్మతో లియోనార్డో డికాప్రియో

రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఉక్రెయిన్ దేశానికి హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో భారీ విరాళం ప్రకటించాడు. 10 మిలియన్ అమెరికన్ డాలర్లు... అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 77 కోట్లు డోనేట్ చేశాడు. అయితే, ఈ దానం వెనుక కేవలం డికాప్రియో రష్యా వ్యతిరేకత మాత్రమే లేదు. ఉక్రెయిన్‌పై ‘టైటానికి’ స్టార్‌కి ప్రత్యేక ప్రేమ... 


ఉక్రెయిన్... లియోనార్డో డికాప్రియో అమ్మమ్మగారి దేశం! జెలెనా స్టెప్‌నోవ్నా స్మిర్నోవాగా ఆమె అక్కడే జన్మించింది. అయితే, 1917లో ఉక్రెయిన్ నుంచీ జర్మనీ దేశానికి వారి కుటుంబం వలస వెళ్లిందట. అక్కడ డికాప్రియో తల్లి జన్మించింది. ఆపైన అమెరికా చేరుకున్న ఆమె 1974లో ‘టైటానిక్’ స్టార్‌కి జన్మనిచ్చింది. అలా 47 ఏళ్ల హాలీవుడ్ సూపర్ స్టార్‌కి తల్లి వైపు నుంచీ ఉక్రెయిన్ దేశంతో అనుబంధం ఉంది!

Updated Date - 2022-03-09T02:03:13+05:30 IST