సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సమంత, కీర్తి సురేష్, రష్మిక మందన్న బాటలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్

ABN, First Publish Date - 2022-03-13T22:21:17+05:30

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బీస్ట్’.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ‘అరబిక్ కుతు’ పాట ఈ మధ్యే విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ పాట విడుదలైన మూడు వారాలకే యూట్యూబ్‌లో దాదాపుగా 168మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. 


‘అరబిక్ కుతు’ పాటకు ఇప్పటికే అనేకమంది సెలబ్రెటీలు డ్యాన్స్ చేశారు. సమంత, కీర్తి సురేష్, రష్మిక మందన్న, యాషికా ఆనంద్ తదితరులు స్టెప్పులేశారు. వీరి బాటలోనే నడుస్తూ తాజాగా మరొకరు ఈ జాబితాలోకి చేరారు. ఆమె ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అష్నా జవేరి. ఆమె ఈ సాంగ్‌కు కాలు కదిపింది. ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘ఇన్‌స్టా రీల్స్ చేయడం కూడా ఓ వర్కౌటే’’ అని అష్నా క్యాప్షన్ ఇచ్చింది. ఈ పాటను జోనితా గాంధీతో కలిసి అనిరుధ్ అలపించారు. స్టార్ హీరో శివ కార్తికేయన్ లిరిక్స్ రాశారు.   


అష్నా జవేరి మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు తమిళ చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించింది. ‘వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం’లోని ఆమె పాత్రకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి.



Updated Date - 2022-03-13T22:21:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!