యాక్షన్ సన్నివేశాలతో ‘బీస్ట్’ ట్రైలర్.. ‘కేజీఎఫ్-2’కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం..

ABN , First Publish Date - 2022-04-03T00:56:15+05:30 IST

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ‘బీస్ట్’. అందాల భామ పూజా హెగ్డే కథానాయికగా

యాక్షన్ సన్నివేశాలతో ‘బీస్ట్’ ట్రైలర్.. ‘కేజీఎఫ్-2’కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం..

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ‘బీస్ట్’. అందాల భామ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఉగాదిని పురస్కరించుకుని ‘బీస్ట్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో  ఆసక్తికరంగా రూపొందించారు. 


ఇళయదలపతి విజయ్ ‘బీస్ట్’లో ఇండియన్ స్పై ఏజెంట్‌గా అలరించనున్నాడు. వీర రాఘవన్ అనే పాత్రలో కనిపించనున్నాడు. చెన్నై, ఈస్ట్ కోస్ట్ మాల్‌లో ఉన్న వారిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తే.. వారిని విజయ్ ఏలా కాపాడాడు అనేదే చిత్ర కథగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు నెట్టింట మంచి రెస్పాన్స్ లభించింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన సినిమా ‘కేజీఎఫ్-2’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ‘బీస్ట్’ అంతకు ఒక్క రోజు ముందు ఏప్రిల్ 13న రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదల కావడం చెప్పుకోదగ్గ విశేషం. ‘బీస్ట్’ ట్రైలర్‌ను చూస్తే ‘కేజీఎఫ్-2’కు గట్టి పోటీ ఇచ్చే ఇచ్చే అవకాశం ఉంది.Updated Date - 2022-04-03T00:56:15+05:30 IST

Read more