ప్రేమకథా చిత్రంతో.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్య రజినీకాంత్
ABN , First Publish Date - 2022-03-21T21:41:16+05:30 IST
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించిన సంగతి తెలిసిందే. 18ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరూ సోషల్ మీడియాలో వేర్వేరుగా వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం వీరిద్దరూ తమ పనుల్లో బిజీ అయ్యారు.
తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆమె బీ టౌన్‌లోకి దర్శకురాలిగా రంగప్రవేశం చేయబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఆమె తెలిపింది. ‘‘వారాన్ని ఇంతకంటే అద్భుతంగా ప్రారంభించలేను. నేను దర్శకురాలిగా బాలీవుడ్‌లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ‘ఓ సాథీ చల్’ అనే ప్రేమకథా చిత్రానికి నేను దర్శకత్వం వహంచబోతున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగతోంది’’ అని ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఈ చిత్రాన్ని సీ9 పిక్చర్స్ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితమే ఐశ్వర్య ‘పాయని’ అనే మ్యూజిక్ వీడియోకు దర్వకత్వం వహించింది. ఈ పాటను అనిరుధ్ ఆలపించాడు. అంకిత్ తివారీ సంగీతం అందించాడు.ఈ మ్యూజిక్ వీడియో పాన్ ఇండియాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కింది. ఈ పాటలో టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నటించడం విశేషం.