సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హైదరాబాద్‌లోని బైక్ షోరూంలో కోలీవుడ్ హీరో సందడి

ABN, First Publish Date - 2022-04-16T21:43:32+05:30

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమైన స్టార్ హీరో అజిత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమైన స్టార్ హీరో అజిత్. ‘ఆరంభం’, ‘ఎంతవాడు గాని’, ‘వివేకం’ వంటి సినిమాలతో ఈ మధ్య కాలంలో అభిమానులను అలరించాడు. కొన్ని రోజుల క్రితం అజిత్ హీరోగా విడుదలైన ‘వలీమై’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయినా కూడా విరామం లేకుండానే ‘తల’ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి  ‘ఏకే 61’ అని వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. 


‘ఏకే 61’ను దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా స్టార్ హీరో అజిత్ బీఎమ్‌డబ్ల్యూ షోరూంలో సందడి చేశాడు. షోరూంని సందర్శించి బీఎమ్‌డబ్ల్యూ బైక్‌ని పరీక్షించాడు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో కలసి ఫోటోలకి ఫోజులిచ్చాడు. అజిత్ స్వతహాగా బైక్ రేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ హీరోకి బైక్‌లంటే చాలా ఇష్టం. అందుకే, అత్యంత ఖరీదైన బైక్స్‌తో కళకళలాడే బీఎండబ్ల్యూ షోరూంని అతడు ప్రత్యేకంగా సందర్శించాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక  ‘ఏకే 61’లో యోగి బాబు, అదితి రావ్ హైదరీ, ప్రకాశ్ రాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Updated Date - 2022-04-16T21:43:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!