మ్యూజిక్ డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన హీరో Karthi

ABN , First Publish Date - 2022-05-22T22:05:24+05:30 IST

విలక్షణ నటన, విభిన్న పాత్రలతో అభిమానులను అలరిస్తున్న కోలీవుడ్ నటుడు కార్తి (Karthi). ‘ఆవారా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘ఖైదీ’(Kaithi), ‘సుల్తాన్’ వంటి చిత్రాలతో టాలీవుడ్

మ్యూజిక్ డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన హీరో Karthi

విలక్షణ నటన, విభిన్న పాత్రలతో అభిమానులను అలరిస్తున్న కోలీవుడ్ నటుడు కార్తి (Karthi). ‘ఆవారా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘ఖైదీ’(Kaithi), ‘సుల్తాన్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం మణిరత్నం మెగా ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan)లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కార్తి తాజాగా ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఖరీదైన గిప్ట్‌ను ఇచ్చాడు. 


తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్తి, యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raja) సన్నిహిత మిత్రులన్న సంగతి తెలిసిందే. నిజం చెప్పాలంటే ఒకే పాఠశాలలో కలసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఆ స్నేహ బంధం అలానే కొనసాగుతూ ఉంది. కార్తి నటించిన ‘పరుత్తి వీరన్’, ‘పయ్యా’, ‘నాన్ మహాన్ అల్లా’, ‘బిర్యాని’ చిత్రాలకు యువనే సంగీతం అందించాడు. యువన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 25ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నైలోని వైఎమ్‌సీఏ గ్రౌండ్‌లో ఓ ఈవెంట్ జరిగింది. యువన్‌ను ఈ వేడుకలోనే కార్తి సర్‌ప్రైజ్ చేశాడు. లగ్జరీ వాచ్‌ను బాహుమతిగా అందించాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘విరుమన్’ (Viruman) చిత్రానికీ యువనే సంగీతం అందిస్తున్నాడు. ‘విరుమన్’కు ముత్తయ్య (Muttayya) దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్(Adithi Shankar) ఈ చిత్రంతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది.Updated Date - 2022-05-22T22:05:24+05:30 IST