సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇళయరాజా పెద్దరికానికి అది మంచిది కాదు: Kollywood దర్శకుడు

ABN, First Publish Date - 2022-06-19T03:40:43+05:30

సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) వైఖరిని కోలీవుడ్‌ దర్శకుడు శీను రామస్వామి ఖండించారు. ఒక వ్యక్తిని కారణం చెప్పకుండా దూరంగా పెట్టడం ఆయన పెద్దరికానికి మంచిది కాదని హితవు పలికారు. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) - గాయత్రి (Gayathri) జంటగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) వైఖరిని కోలీవుడ్‌ దర్శకుడు శీను రామస్వామి ఖండించారు. ఒక వ్యక్తిని కారణం చెప్పకుండా దూరంగా పెట్టడం ఆయన పెద్దరికానికి మంచిది కాదని హితవు పలికారు. విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) - గాయత్రి (Gayathri) జంటగా నటించిన చిత్రం ‘మామనిదన్‌’ (maamanithan). ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా తాజాగా విజయ్‌ సేతుపతి, గాయత్రి, ఆర్‌కే సురేష్‌, శీను రామస్వామి (Seenu Ramasamy)లు విలేకరులతో మాట్లాడారు. 


ఈ కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకుడు శీను రామస్వామి మాట్లాడుతూ... ‘‘మామనిదన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చేటపుడు లేదా డబ్బింగ్‌ చెప్పేటపుడు ఇళయరాజా దర్శకుడైన నన్ను దగ్గరకు కూడా చేర్చలేదు. చిత్ర దర్శకుడిగా, గీత రచన తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కానీ, అస్సలు పాటలు ఎవరు రాశారో కూడా నాకు చెప్పలేదు. ఇక్కడ నేను ఒక్క తప్పు చేశాను. పాటలకు ట్యూన్స్‌ లేకుండానే పాటల చిత్రీకరణ పూర్తిచేశాను. దాన్ని చూసి ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా సంగీత ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. కానీ, పాటలకు ట్యూన్స్‌ కంపోజింగ్‌ చేసేటప్పుడు చిత్ర దర్శకుడిగా నన్ను అనుమతించకపోవడం చాలా బాధగా ఉంది. ఈ ఆవేదనను ఇంతకాలం మనసులో దాచుకున్నాను. ఇళయరాజా నన్ను దూరంగా ఉంచడానికి కారణం నాకు ఇప్పటికీ తెలియదు. కానీ, ఆయనతో కలిసి నేను అనేక చిత్రాలకు పనిచేయాలని భావిస్తున్నాను. నా గురించి ఆయన మనస్సులో ఏవేని చెడు భావాలు ఉంటే చెరిపేసుకోవాలని కోరుతున్నాను. ‘మామనిదన్‌’ చిత్రానికి ఇళయరాజా, ఆయన ఇద్దరు కుమారులు యువన్‌ శంకర్‌ రాజా, కార్తీక్‌ రాజాలు సంగీతం సమకూర్చాల్సింది. అది కార్యరూపం దాల్చలేదు. కార్తీక్‌ రాజా తప్పుకోగా, ఇళయరాజా, యువన్‌లు సంగీతం సమకూర్చారు’’ అని వివరించారు. 

Updated Date - 2022-06-19T03:40:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!