పెళ్లి వేడుకలో సందడి చేసిన కోలీవుడ్ స్టార్ హీరోలు
ABN , First Publish Date - 2022-02-21T22:49:48+05:30 IST
కోలీవుడ్‌లో పలు హిట్ సినిమాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన వ్యక్తి అన్బు
కోలీవుడ్‌లో పలు హిట్ సినిమాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించిన వ్యక్తి అన్బు చెజియన్. సినీ ఇండస్ట్రీలో అందరికి ఆయన పేరు సుపరిచితమే. తాజాగా అన్బు చెజియన్ కూతురు సుస్మిత పెళ్లి జరిగింది. శరణ్ అనే వ్యక్తితో ఫిబ్రవరి 21న ఆమె ఏడడుగులు వేసింది. ఈ వేడుకకు అనేక మంది కోలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సెలబ్రెటీల అభిమానులందరూ ఈ పిక్స్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, ప్రభులు హాజరయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, మనో బాలతో పాటు పలువురు సెలబ్రెటీలు విచ్చేసి కొత్త దంపతులకు తమ ఆశీర్వచనాలను అందించారు. కాగా, ఈ వారంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వలీమై’ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తమిళనాడు హక్కులను అన్బునే పొందారు. ఈ మూవీని రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1000 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు.