Darshan: అదృష్ట లక్ష్మీపై వివాదస్పద వ్యాఖ్యలు.. హీరో పైకి చెప్పు విసిరిన అభిమాని..

ABN , First Publish Date - 2022-12-19T15:31:14+05:30 IST

కన్నడ హీరో దర్శన్ (Darshan) పైకి ఓ అభిమాని చెప్పు విసిరాడు. తన తదుపరి చిత్రం ‘క్రాంతి’ (Kranti) ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ అనుహ్య ఘటనతో దర్శన్ కంగుతిన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

Darshan: అదృష్ట లక్ష్మీపై వివాదస్పద వ్యాఖ్యలు.. హీరో పైకి చెప్పు విసిరిన అభిమాని..

కన్నడ హీరో దర్శన్ (Darshan) పైకి ఓ అభిమాని చెప్పు విసిరాడు. తన తదుపరి చిత్రం ‘క్రాంతి’ (Kranti) ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ అనుహ్య ఘటనతో దర్శన్ కంగుతిన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

దర్శన్ హీరోగా నటించిన సినిమా ‘క్రాంతి’. రచిత రామ్ (Rachita Ram) హీరోయిన్‌గా నటించింది. వి.హరికృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆదివారం హోస్‌పేటలో రెండో పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శన్‌తో సహా మూవీ టీం మొత్తం పాల్గొంది. నటీనటులు స్టేజ్‌పై ప్రసంగిస్తుండగా ఓ అభిమాని దర్శన్ పైకి చెప్పు విసిరాడు. ఈ ఘటనతో మూవీ టీం అంతా షాక్‌కు గురయింది. దర్శన్ అభిమానులందరు ఉద్రేకానికి గురయ్యారు. ఆ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే, అతడు మాత్రం ఆ వ్యక్తిని ఏమీ చేయవద్దని సూచించాడు. ‘‘ఇందులో నీ తప్పేమీ లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు’’ అని హీరో వ్యాఖ్యానించాడు. కొన్ని రోజుల క్రితం క్రాంతి సినిమా ప్రమోషన్స్‌లోనే దర్శన్ అదృష్ట లక్ష్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హీరో ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను అనేక మంది విమర్శించారు. స్త్రీలపై ద్వేషంతోనే ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పారు. దర్శన్ 2011లో తన భార్యను కూడా లైంగిక వేధింపులకు గురిచేశాడు.

Updated Date - 2022-12-19T15:33:38+05:30 IST