Darshan: దాడి తర్వాత తొలిసారి స్పందించిన దర్శన్

ABN , First Publish Date - 2022-12-22T20:41:28+05:30 IST

కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ అపరిచిత వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఈ ఉదంతంపై దర్శన్ తొలిసారి స్పందించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తనకు అండగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలిపాడు.

Darshan: దాడి తర్వాత తొలిసారి స్పందించిన దర్శన్

కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ అపరిచిత వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఈ ఉదంతంపై దర్శన్ తొలిసారి స్పందించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తనకు అండగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘ఈ సమయంలో నా కంటే నా సహా నటీ, నటులు బాధపడుతున్నారు. ఇటువంటి ఘటనలు మనిషిని బలహీన పర్చవు. మరింత బలంగా మారుస్తాయి. గతంలో మన కన్నడ ఇండస్ట్రీలో ఇటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. న్యాయం కోసం నిలబడిన నా స్నేహితులు, నటీనటులకు ధన్యవాదాలు. సినిమా ఈవెంట్‌ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వారికి కూడా కృతజ్ఞతలు. ఒక కార్యక్రమాన్ని నాశనం చేయడానికి వంద మంది వ్యక్తులు ప్రయత్నిస్తే కొన్ని లక్షల మంది సెలబ్రిటీలు రంగంలోకి దిగుతారని నేను మొదటి నుంచే చెబుతున్నాను. ప్రస్తుతం అదే జరిగింది. అందరు ఈ దాసునిపై కనబరుస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని దర్శన్ తెలిపాడు.

దర్శన్ హీరోగా నటించిన సినిమా ‘క్రాంతి’ జనవరి 26న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం హోస్‌పేటలో రెండో పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శన్‌తో సహా మూవీ టీం మొత్తం పాల్గొంది. నటీనటులు స్టేజ్‌పై ప్రసంగిస్తుండగా ఓ అభిమాని దర్శన్ పైకి చెప్పు విసిరాడు. ఈ ఘటనతో మూవీ టీం అంతా షాక్‌కు గురయింది. దర్శన్ అభిమానులందరు ఉద్రేకానికి గురయ్యారు. ఆ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే, అతడు మాత్రం ఆ వ్యక్తిని ఏమీ చేయవద్దని సూచించాడు. ఈ దుర్ఘటనపై కన్నడ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కిచ్చా సుదీప్‌, శివరాజ్‌కుమార్‌, సుమలత తదితరులు హీరోకు తమ మద్దతును ప్రకటించారు.

Updated Date - 2022-12-22T20:44:19+05:30 IST