కామ్నా జెఠ్మలానీ.. మళ్లీ వచ్చేందుకు రెడీ!

ABN , First Publish Date - 2022-03-17T03:46:37+05:30 IST

గత కొంతకాలంగా కెమెరాకు దూరమైన ఈమె ఇపుడు మళ్ళీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.. కథ డిమాండ్‌ చేస్తే ఎలాంటి పాత్రల్లోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అదేసమయంలో..

కామ్నా జెఠ్మలానీ.. మళ్లీ వచ్చేందుకు రెడీ!

కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు హీరోయిన్‌ కామ్నా జెఠ్మలానీ వెల్లడించింది. కథకు తగినట్టుగా నటించేందుకు అంగీకారం తెలిపింది. 2005లో జయం రవి నటించిన ‘ఇదయతిరుడన్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కామ్నా... ఆ తర్వాత హీరో జీవాతో కలిసి ‘మచ్చక్కారన్‌’, రాఘవ లారెన్స్‌తో ‘రాజాధి రాజా’, ‘కాసేదాన్‌ కడవులడా’ వంటి చిత్రాల్లో నటించింది. కేవలం ఒక్క కోలీవుడ్‌కే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది.


అయితే, గత కొంతకాలంగా కెమెరాకు దూరమైన ఈమె ఇపుడు మళ్ళీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.. కథ డిమాండ్‌ చేస్తే ఎలాంటి పాత్రల్లోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అదేసమయంలో ప్రస్తుతం పలు కోలీవుడ్‌ ప్రాజెక్టుల్లో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది.Updated Date - 2022-03-17T03:46:37+05:30 IST

Read more