నడిగర్ సంఘం ట్రస్టీగా కమల్‌హాసన్!
ABN , First Publish Date - 2022-03-24T19:36:50+05:30 IST
మూడేళ్లగా ఎదురుచూస్తున్న ‘నడిగర్ సంఘం’ ఎన్నికల ఫలితాలు ఎట్టుకేలకు విడుదలయ్యాయి. సీనియర్ నటుడు నాజర్ సారథ్యంలోని ‘పాండవర్ అని’ ప్యానెల్ విజయభేరీ మోగించింది. ఇటీవల నడిగర్ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.

మూడేళ్లగా ఎదురుచూస్తున్న ‘నడిగర్ సంఘం’ ఎన్నికల ఫలితాలు ఎట్టుకేలకు విడుదలయ్యాయి. సీనియర్ నటుడు నాజర్ సారథ్యంలోని ‘పాండవర్ అని’ ప్యానెల్ విజయభేరీ మోగించింది. ఇటీవల నడిగర్ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. దీనిలో నడిగర్ సంఘం మేనేజింగ్ ట్రస్టీలుగా మరో తొమ్మిది మందిని నియమిస్తూ తీర్మానించారు. మొత్తం 9 మంది సభ్యుల్లో కొత్త కార్యవర్గం నుంచి నాజర్, విశాల్, కార్తీ, కార్యవర్గ సభ్యుల నుంచి రాజేష్, లతా సేతుపతి, కోవై సరళ, జనరల్ టీం నుంచి కమల్ హాసన్, పూచ్చి మురుగన్, సచ్చు(సరస్వతి)లకు స్థానం దక్కింది. అయితే, ఈ ట్రస్టీకి అధ్యక్షుడిగా నాజర్ ఉంటారు. నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనులు మూడు నెలల్లో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతి నెల రెండో ఆదివారం సంఘం సమావేశం నిర్వహించాలని చాలా అంశాలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించారు.