Vikram: అక్కడ బాహుబలి 2ని దాటేసిన Kamal Haasan మూవీ.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

ABN , First Publish Date - 2022-06-19T15:46:02+05:30 IST

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ సినిమాలు సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే...

Vikram: అక్కడ బాహుబలి 2ని దాటేసిన Kamal Haasan మూవీ.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ సినిమాలు సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. అందులోనూ బాహుబలి 2 (Bahubali 2) కలెక్షన్ల సునామిని సృష్టించిన ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్ల వసూళ్లని సాధించింది. అంతేకాకుండా భారతీయ చిత్ర పరిశ్రమల్లో అన్ని ఇండస్ట్రీల్లో అప్పటివరకూ ఉన్న రికార్డుల దాటి నెం.1 స్థానంలో నిలిచింది. తెలుగుతో పాటు మిగిలిన అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఆ మూవీ వసూళ్ల సునామీ ఇంకా చెక్కుచెదరలేదు. కానీ.. తాజాగా తమిళనాడులో ఆ మూవీ రికార్డులను కమల్ హాసన్ మూవీ కొల్లగొట్టింది.


ఖైదీ, మాస్టర్ సినిమాలతో తెలుగుతో పాటు తమిళంలోనూ గుర్తింపు పొందిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఆ యంగ్ డైరెక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘విక్రమ్’. తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రల్లో నటించగా.. సూర్య (Surya) అతిథి పాత్రలో మెరిశాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ మాస్ ఎంటర్‌టైనర్‌గా దూసుకెళుతోంది. రిలీజైన ప్రతి చోట పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లనే రాబడుతోంది. ఈ మూవీ తాజాగా తమిళనాడులో కలెక్షన్లపరంగా బాహుబలి 2 దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సినీ విశ్లేషకుడు సుమిత్ కాడేల్ ట్వీట్ చేశాడు.


సుమిత్ చేసిన ట్వీట్‌లో.. ‘తమిళనాడులో బాహుబలి జీవితకాల కలెక్షన్లు రూ.155 కోట్లని దాటేసిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళనాడులో రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి తమిళ సినిమా ఇదే’ అంటూ రాసుకొచ్చాడు. అయితే.. ఇప్పటివరకూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల కలెక్షన్లని సాధించింది. కాగా.. కమల్ సొంత బ్యానరైన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందించిన ఈ మూవీలోని కథాంశం, యాక్షన్ సీక్వెన్స్‌లు, నటీనటుల ఫర్ఫామెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను సీట్ ఏడ్జ్ మీద కూర్చునేలా చేశాయి. దీంతో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్‌కి సూపర్ హిట్ దక్కింది.



Updated Date - 2022-06-19T15:46:02+05:30 IST