సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విక్రమ్ సక్సెస్ తర్వాత.. Suriya కు Kamal Haasan గిఫ్ట్‌గా ఇచ్చిన Rolex watch ధర ఎంతో తెలుసా..?

ABN, First Publish Date - 2022-06-10T02:08:05+05:30

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నుంచి వచ్చిన తాజా సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) పాన్ ఇండియాగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నుంచి వచ్చిన తాజా సినిమా ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) పాన్ ఇండియాగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో విడుదల అయింది. ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి భారీ వసూళ్లను రాబడుతుంది. వరల్డ్ వైడ్‌గా రూ. 200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తన సంతోషాన్ని చిత్ర బృందంతో పంచుకున్నారు. అందరికి బాహుమతులు అందజేశారు.  


‘వికమ్ర్’ లో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), కీలక పాత్రలు పోషించారు. సూర్య(Suriya) క్లైమాక్స్ సీన్‌లో అతిథి పాత్రలో కనిపించారు. ఈ పాత్రలో కనిపించినందుకు సూర్య ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. అయినప్పటికీ, సినిమా భారీ విజయం సాధించడంతో కమల్ హాసన్ ఖరీదైన రోలె‌క్స్ వాచ్‌ను సూర్యకు బహుమతిగా అందించారు. అందుకు సంబంధించిన ఫొటోలను సూర్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఇటువంటి క్షణాలు జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి. రోలెక్స్ వాచ్ అందించినందుకు కృతజ్ఞతలు అన్న’’ అని సూర్య ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఈ వాచ్ ఖరీదు రూ. 10లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అంతకుముందే దర్శకుడైన లోకేశ్‌ను కమల్ హాసన్ లెక్స‌స్ కారును బాహుకరించి సర్‌ప్రైజ్ చేశారు. 13మంది అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు అపాచీ ఆర్ టీఆర్ -160 మోటార్ బైక్‌లను అందించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కేరళలో ఆల్ టైం నం-1 తమిళ్ మూవీగా రికార్డు సృష్టించింది. ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్స్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. ‘విక్రమ్’ ను కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) తో కలసి ఆర్ మహేంద్రన్‌(R Mahendran) నిర్మించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ. 120కోట్లని అంచనా. ప్రచార కార్యక్రమాల కోసం మరో రూ. 5కోట్లను కేటాయించారు. ఒక్క హిందీ మినహా అన్ని ప్రాంతాల్లో ఈ మూవీ లాభాల్లో పయనిస్తుంది.



Updated Date - 2022-06-10T02:08:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!