Kaalangalil Aval vasantham: ప్రేమంటే ఆకర్షణ కాదు అంతకుమించి..

ABN , First Publish Date - 2022-10-14T15:54:53+05:30 IST

కౌశిక్‌ రామ్‌(Koushik Ram)ను హీరోగా పరిచయం చేస్తూ ఆరమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌, శ్రీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ‘కాలంగళిల్‌ అవళ్‌ వసంతం’..

Kaalangalil Aval vasantham: ప్రేమంటే ఆకర్షణ కాదు అంతకుమించి..

కౌశిక్‌ రామ్‌(Koushik Ram)ను హీరోగా పరిచయం చేస్తూ ఆరమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌, శ్రీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ‘కాలంగళిల్‌ అవళ్‌ వసంతం’ (Kaalangalil Aval Vasantham) చిత్రం ఆడియోను తాజాగా రిలీజ్‌ చేశారు. అఖిల భారత సమత్తువ మక్కల్‌ కట్చి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్నావూరు నారాయణన్‌ ఆడియో రిలీజ్‌ చేశారు. వి స్క్వేర్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సినిమా విడుదల చేయనుంది. అంజలీ నాయర్‌ (Anjali Nair) హీరోయిన్‌. హీరోషిణి, వకీల్‌ మాథ్యూ, ఆర్‌.జె.విఘ్నేష్‌, అనితా సంపత్‌, స్వామినాథన్‌, సౌందర్య తదితరులు ఇతర పాత్రలను పోషించారు. చిత్రం గురించి దర్శకుడు రాఘవ్‌ మిర్థాత్‌ (Raghav Mirdath) మాట్లాడుతూ.. ‘ప్రేమ అంటే కేవలం యువతీయువకుల మధ్య ఆకర్షణ కాదు. దీనికి మించింది ఏదో ఉందనే ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించడమే ఈ చిత్ర కథ’ అని వివరించారు. 



Updated Date - 2022-10-14T15:54:53+05:30 IST

Read more